ప్రాణాలు తీస్తే సత్యలోకం వస్తుందా..విద్యావంతులు ఉన్మాదులెలా అయ్యారు ?

-

చదువులేవీ వారి అజ్ఞానాన్ని పొగట్టలేకపోయాయి. విద్యాబుద్దులు నేర్పించే ఆ దంపతులు..సత్యలోకమంటూ కన్నబిడ్డల్నే పొట్టనపెట్టుకున్నారు. ప్రాణాలు తీస్తే సత్యలోకం వస్తుందా..ఉన్నత విద్యావంతులు ఉన్మాదులెలా అయ్యారు..నరబలి ఇచ్చిన ఘటనలు ఎన్నో చూశాం. కానీ కన్నబిడ్డల్నే మూఢనమ్మకాలతో కడతేర్చిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. ఇందులో భయంకరమైన నిజం ఏంటంటే..ఆ పిల్లలకూ ముందే తెలుసు. అసలేం జరిగింది..

మూఢనమ్మకం మనిషిని ఏస్థాయికైనా తీసుకెళ్తుంది అనడానికి ఉదాహరణ మదనపల్లిలో జరిగిన దారుణం. ఒక పిచ్చి విశ్వాసంతో కన్నబిడ్డల్ని కిరాతకంగా హత్య చేశారు. తాము ఏం చేస్తున్నామో తెలియనంత భమ్రలో పడి.. ఇద్దరి ప్రాణాలను బలి తీసుకున్నారు. కన్నబిడ్డల్ని చంపుకుంటే సత్యలోకం వస్తుందా..వీరి పిచ్చికాకపోతే పిల్లలే లేని ఆ సత్యలోకం వస్తే ఏంటి పోతే ఏంటి.. వారి అంధవిశ్వాసం ముందు చదువుకున్న చదువు, బోధించే పాఠాలు అన్నీ వృథాయే.

కనిపించని ఆ కొత్త ప్రపంచం కోసం కన్నబిడ్డల్నే బలిచ్చేందుకు సిద్ధమయ్యారంటే వారి మానసిక పరిస్తితి ఎలా ఉందో అర్థమవుతుంది. కుటుంబం మొత్తం నగ్నంగా పూజలు నిర్వహించారు.. పెద్దమ్మాయికి సగం గుండు కొట్టించారు. పూజగదిలోకి తీసుకెళ్లారు. ఆ అమ్మాయి నోట్లో రాగి చెంబు పెట్టి డంబెల్‌తో కొట్టి హతమార్చారు. గుడ్డిగా నమ్మిన దాని కోసం మనిషి ఎంత పరాకాష్ఠకు చేరుకుంటాడో చెప్పేందకు ఈ ఘటనే నిదర్శనం.

తాము ప్రాణ త్యాగం చేయబోతున్నామని పిల్లలకు ముందే తెలుసు. ఇద్దరు అన్నింటికీ సిద్ధమయ్యారు. సత్యలోకమనే భ్రమలో పడి తమకు తాముగా సమిధలయ్యారు.. ఈ ఘటనకు ముందే..చిన్నకూతురు ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. శివ ఈజ్‌ కమింగ్‌..వర్క్‌ ఈజ్‌ డన్‌ అంటూ పోస్టు పెట్టింది. దాని అర్థం ప్రాణ త్యాగానికి సిద్ధమయ్యానని, తాను సత్యలోకానికి వచ్చేందుకు రెడీ ఉన్నానని ముందే హింట్ ఇచ్చింది.

పురుషోత్తం కుటుంబానికి ముందు నుంచి ఆధ్యాత్మిక భావన ఎక్కువ. ఐతే కొన్ని రోజులకు ఆ స్థాయిని మించి పోయింది. వారికి వారు ఓ కొత్త ప్రపంచాన్ని ఊహించుకున్నారు. ఆ ప్రపంచానికి వెళ్లేందుకు కలలు కన్నారు. దానికి సత్యలోకమని పేరు పెట్టుకున్నారు. బంధాల నుంచి విముక్తులైతేనే అక్కడికి వెళ్తామని గట్టిగా నమ్మారు. అందులో భాగంగానే నరబలికి సిద్ధమయ్యారు.

ముందుగా ఇక్కడ నుంచి పిల్లలకు విముక్తి కల్పిస్తే వారు సత్యలోకానికి వెళ్తారని ఆ దంపతులు భావించారు. అనుకున్నట్లే వారిని హత్యచేశారు. తాము సత్యలోకం వెళ్లిన తర్వాత కలవొచ్చన్నది వారి ఆలోచన. ఐనా వీరి పిచ్చికాకపోతే..ఇక్కడే మంచి హోదాలో ఉన్నారు. సంఘంలో గౌరప్రదమైన స్థాయిలో ఉన్నారు. చేతినిండా డబ్బులు ఉన్నాయి. ఉండడానికి మంచి ఇళ్లు ఉంది. ఇద్దరు పిల్లలు బాగా చదువుతున్నారు. దేనికి లోటు లేదు. రిటైర్మెంట్‌కు వచ్చారు. ఎవరికైనా ఇంతకు మించి ఏం కావాలి. ఇక్కడే అన్ని అనుభవించే అవకాశం ఉన్నా..ఏదేదో ఊహించుకొని లేని సత్యలోకం కోసం ఈ స్థాయికి దిగజారారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news