కేంద్రం ఎన్నో రకాల స్కీములని తీసుకు వచ్చింది. మధ్య తరగతి వాళ్ళ కోసం ఎన్నో బీమా పథకాలను తీసుకు వచ్చింది. పైగా అతి తక్కువ ప్రీమియంతో కూడా కొన్ని స్కీమ్స్ ని కేంద్రం తీసుకు రావడం జరిగింది. వీటిల్లో డబ్బులు పెడితే చక్కటి లాభాలని పొందడానికి అవుతుంది.
కేంద్రం తీసుకు వచ్చిన స్కీమ్స్ లో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఒకటి. ఈ స్కీమ్ వలన చక్కటి లాభాలు వున్నాయి. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. ఏడాదికి రూ. 20 డిపాజిట్ చేస్తే రూ. 2 లక్షల వరకు బీమా ప్రయోజనాలను పొందొచ్చు. ఈ స్కీమ్ లో డబ్బులు పెట్టాలంటే సేవింగ్స్ అకౌంట్ ఉండాలి.
ఈ పథకం లో ఎలా చేరాలి..?
ఈ స్కీమ్ లో చేరాలంటే ముందు మీరు అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్ళండి.
నెక్స్ట్ మీరు దరఖాస్తు ఫారం తీసుకుని… అప్లికేషన్ లో పొందుపర్చిన వివరాలు పూర్తి చేసి, డాక్యుమెంట్ల ని అటాచ్ చేయాలి.
ఈ స్కీమ్ కోసం ఇరవై అకౌంట్ నుండి తీసుకోవడం జరుగుతుంది.
18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు వున్నవాళ్లు ఎవరైనా సరే ఇందులో చేరచ్చు.
రోడ్డు ప్రమాదంలో మరణిస్తే మృతుడి కుటుంబ సభ్యులకు రూ.2,00,000 ఆర్థిక సాయం వస్తుంది.
అదే ప్రమాదం లో శాశ్వత అంగవైకల్యం కలిగితే రూ.లక్ష ఇస్తారు.