Breaking : మునుగోడులో తొలిరోజు ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

-

నల్లగొండ జిల్లాలోని మునుగోడు ఎమ్మెల్యే కోటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఇటీవల కాంగ్రెస్‌ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే.. తాజాగా మునుగోడు ఉప ఎన్నికకు నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో తొలిరోజు ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ప్రజా ఏక్తా పార్టీ నుంచి నాగరాజు, స్వతంత్ర అభ్యర్థిగా మారం వెంకటరెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ 40 మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలు తీసుకున్నారు.

munugode bypoll date, Munugode Bypoll Schedule: మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్  విడుదల.. ఆ రోజే ఫలితాలు - release of schedule for munugode by-election -  Samayam Telugu

కాగా, ఈ ఉప ఎన్నికకు నవంబరు 3న పోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ నెల 14 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 15న నామినేషన్లను పరిశీలిస్తారు. ఈ నెల 17 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఇవాళ నోటిఫికేషన్ వెలువడగానే టీఆర్ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించిన విషయం తెలిసిందే. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తమ పార్టీ తరఫున పోటీ చేస్తారని ప్రకటించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌ రెడ్డి పోటీకి దిగుతున్నారు. ఈ మూడు పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ మూడు పార్టీల అభ్యర్థులు త్వరలోనే నామినేషన్లు దాఖలు చేస్తారు.

 

Read more RELATED
Recommended to you

Latest news