ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ.. భర్త చేతిలో మోసపోయిన హీరోయిన్..!!

తాజాగా ప్రముఖ సీరియల్ నటి దివ్య, శ్రీధర్ తన భర్త మోసం చేశారని పోలీసులను ఆశ్రయించారు. తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని , ప్రస్తుతం తాను గర్భవతి అని, ఇప్పుడు తనను కాదని మరో నటితో తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సన్ టీవీలో ప్రసారమైన సెవ్వంధీ అనే సీరియల్ లో ప్రధాన పాత్ర పోషించింది. ఇక అయితే 2017లో కేలడి కన్మణి సీరియల్ లో నటించిన తన సహనటుడు ఆర్నవుతో ప్రేమలో పడింది. కొంతకాలం వీరిద్దరూ రిలేషన్ షిప్ లో కూడా ఉన్నారు. అయితే ఆర్నవ్ అసలు పేరు మహమ్మద్. దివ్య ను పెళ్లి చేసుకోవాలంటే ఆమె మతం మారాల్సి ఉంటుందని అతను చెప్పడంతో ఆమె కూడా ముస్లిం గా మారింది.

ఇక వీరిద్దరూ ఇస్లాం మత ఆచారాల ప్రకారం పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తమ వివాహం గురించి అధికారికంగా ప్రకటించవద్దు అని అతడు కోరినట్లుగా సమాచారం. అదే సమయంలో అతడు మరో నటితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న దివ్య.. అతడిని బహిరంగంగా తనను పెళ్లి చేసుకోవాలని కోరడంతో కాంచీపురంలోని ఒక ఆలయంలో మళ్లీ హిందూ సంప్రదాయాల అనుసరించి పెళ్లి చేసుకున్నారు. గర్భవతి అయితే.. తాను గర్భవతి అయిన తర్వాత తన భర్త వదిలిపెట్టాడు అని ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో చెన్నై ఆసుపత్రిలో చేరినట్లు ఆమె తెలిపింది.

ఇక తనకు లేదా తనకు పుట్టబోయే బిడ్డకు ఏదైనా కీడు జరిగితే ఆర్నవ్ దే బాధ్యత అని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొనింది. అంతేకాదు ఆర్నవ్ చెప్పడంతో తనకు అబార్షన్ చేయడానికి కూడా వైద్యులు ప్రయత్నిస్తున్నారని, తనకు న్యాయం చేయడానికి కమిషనర్ ను ఆశ్రయించినట్లు దివ్య తరపున న్యాయవాది కూడా తెలిపారు.

 

View this post on Instagram

 

A post shared by Divya Shridhar (@divya_shridhar_1112)