ఆ యంగ్ హీరోయిన్ కోసం కొట్టుకు చస్తున్న హీరోలు..!!

సినిమా పరిశ్రమ లో కొన్ని సంఘటనలు విచిత్రంగా ఉంటాయి. క్రేజ్ ఉన్న వారి కోసం జనాలు ముందుగానే కర్చీఫ్ వేస్తారు. వారికి క్రేజ్ లేక పోతే వారి వంక కన్నెత్తి కూడా చూడరు. ప్రస్తుతం ఒక కుర్ర హీరోయిన్ కోసం ఇద్దరు హీరోలు గొడవ పడుతున్నారట ఈ సంచలన గొడవ వ్యవహారం ప్రస్తుతం టాలీవుడ్లో పుకారుగా షికారు చేస్తోంది.

అతనో పెద్ద  సీనియర్ హీరో కొడుకు కొన్ని లవ్ స్టోరీ లు చేసినా కూడా అన్నీ ప్లాప్ అయ్యాయి. ఇక తర్వాత రూట్ మార్చి యాక్షన్ , ఎంటర్ టైనర్ తీసి చేసి హిట్స్ కొట్టాడు. ఇక ఇప్పుడు తాను నెక్స్ట్ సినిమా కోసం బాగా డాన్స్ చేసే హీరోయిన్ కావాలని డిమాండ్ చేస్తున్నాడట. ఆమె ఐతే ప్రస్తుతం యూత్ లో మంచి ఫాలోయంగ్ ఉందని ఆమెనే హీరోయిన్ గా అనుకున్నారట . కాని ఈ విషయాన్ని కని పెట్టిన ఆ కొత్త హీరోయిన్ 2 కోట్ల కంటే తగ్గేది లేదని అంటోందట.వాస్తవానికి ఆమె రేటు కోటి మాత్రమే.

ఈ లోపు ఈ మధ్యనే క్రేజీ హిట్ కొట్టిన మరో హీరో కూడా ఆమె కావాలని నిర్మాత కు ఆర్డర్ వేశాడని ప్రచారం జరుగుతోంది. ఆమె ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తోందని తెలపగా ఎంతైనా ఇవ్వండి అని చెప్పాడట. అవసరం ఐతే నా రెమ్యునరేషన్ లో కొద్దిగా తగ్గించండి అని చెప్పాడట. ఈ విషయం గురించి తెలుసుకున్న మొదటి హీరో వెంటనే ఆమెకు అడ్వాన్స్ పంపించాడట. ఇప్పుడు ఈ విషయంలో ఇద్దరి హీరోల మధ్య పెద్ద గొడవ అయ్యిందట. ఇక గోల ఎందుకని హీరోయిన్ తెలివిగా రెండు అడ్వాన్స్ లు జేబులో వేసుకుని తాపీగా కూర్చుందని గుస గుసలు వినిపిస్తున్నాయి.