మరాఠా సిఎంగా ఉద్ధవ్… ఆయన నేపధ్యం ఇదే…!

-

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనను ముఖ్యమంత్రిగా ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు అంగీకరించాయి. దాదాపు రెండు నెలల నుంచి జరుగుతున్న పరిణామాలకు నేడు ముగింపు కార్డు పడి ఎట్టకేలకు కూటమి అధికారం చేపట్టనుంది. బలపరీక్షకు ముందు బిజెపి చేతులు ఎత్తేయడం దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేయడం, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ రాజీనామా చేయడం, మూడు పార్టీలకు అధికారం చేపట్టే బలం ఉండటంతో గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకి మూడు పార్టీలను ఆహ్వానించనున్నారు.

ఆయన డిసెంబర్ 1 శివాజీ పార్క్ లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం ఉదయం అసెంబ్లీ సమావేశం జరగనుండగా… వారితో ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ప్రోటెం స్పీకర్ గా కాళిదాస్ కోలంబ్కర్ ని ఎన్నుకున్నారు. ఉప ముఖ్యమంత్రులుగా… జయంత్ పాటిల్, బాలా సాహెబ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక శివసేన నుంచి పార్టీ పెట్టిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా… ఉద్ధవ్ థాకరే బాధ్యతలు చేపట్టనున్నారు. అయిదేళ్ళ పాటు ఆయన పదవిలో ఉంటారని శివసేన ధీమా వ్యక్తం చేస్తుంది.

ఇక ఉద్ధవ్ బాల్ ఠాక్రే 27 జూలై 1960 న జన్మించారు. 2003 లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అయిన ఆయన అప్పటి నుంచి పార్టీలో కీలకంగా ఉన్నారు. తన తండ్రి బాలాసాహెబ్ థాకరే మరణం తర్వాత… పార్టీ బాధ్యతలను చేపట్టిన తర్వాత పార్టీ అధ్యక్షుడిగా మినహా బిజెపితో ఉన్న కూటమి ప్రభుత్వంలో ఏ బాధ్యతలు చేపట్టలేదు. 59 ఏళ్ళ థాకరేకు ఇద్దరు కుమారులు ఉండగా… వారిలో ఆదిత్య థాకరే యువసేన అధ్యక్షుడిగా ఉన్నారు. చిన్న కుమారుడు అమెరికాలో చదువుతున్నట్టు సమాచారం. ఆదిత్య థాకరే మొన్నట్టి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

Read more RELATED
Recommended to you

Latest news