‘ఉద్యోగ్ ఆధార్’ అంటే ఏమిటి..? ఎలా అప్లై చెయ్యచ్చు..? పూర్తి వివరాలు మీకోసం..!

-

ఉద్యోగ్ ఆధార్ గురించి చాలా మందికి తెలీదు. ఈరోజు మనం అసలు ఈ ఉద్యోగ్ ఆధార్ అంటే ఏమిటి..? అనే ముఖ్య విషయాలని తెలుసుకుందాం. ఇది కూడా సాధారణ ఆధార్ లాగానే ఉంటుంది. కానీ అది వ్యక్తులకు జారీ చేయరు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఇస్తారు. 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇది. భారత సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇస్తుంది. దీన్ని 2015 సెప్టెంబర్‌లో ప్రారంభించారు. దీన్నే బిజినెస్ ఆధార్ అని కూడా అంటారు. ఉద్యమ్ గా దీన్ని మార్చారు. 4.8 మిలియన్ ఎంఎస్ఎంఈ సంస్థలు ఉద్యోగ్ ఆధార్ రిజిస్టర్ చేసుకున్నాయి.

ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ దీన్ని నిర్వహిస్తుంటుంది. చిరు వ్యాపారులకు సులభంగా లోన్స్ ఇవ్వడానికి ఈ ప్రక్రియ ని కేంద్రం స్టార్ట్ చేసింది. దీని కోసం ఎంట్రప్రెన్యూర్ మెమోరాండమ్-1, ఎంట్రప్రెన్యూర్ మెమోరాండ్మ్-2 ఫిల్ చేయాలి. సులభంగా లోన్ పొందవచ్చు. ఆధార్ కార్డు కావాల్సి వుంది. దీని కోసం ముందుగా ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి. ఆధార్ కార్డు వివరాలను నమోదు చేసిన గెట్ ఓటీపీ పై క్లిక్ చేయాలి. ఓటీపీని ఎంటర్ చేసాక అప్లికేషన్ పేజీ వస్తుంది. డీటెయిల్స్ ని ఇచ్చేయండి. తర్వాత సబ్మిట్‌పై క్లిక్ చేయాలి.

ఇంకో ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి మళ్లీ స్మబిట్ పై నొక్కి వివరాలని ఇచ్చేయాలి. ఉపాధి పొందిన వ్యక్తుల సంఖ్య, జిల్లా పారిశ్రామిక కేంద్రం వివరాలు, కంపెనీ ప్రారంభమైన రోజు ఇలాంటి అన్నీ ఇవ్వాల్సి వుంది. బార్‌కోడ్ రిజిస్ట్రేషన్ సబ్సిడీ, ఇండియా ఇంటర్‌నేషనల్ ట్రేడ్ ఫేర్‌లో పాల్గొనడం వంటి లాభాలు దీని వలన ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news