అవినాష్ కోసం జగన్..టీడీపీకి ఆయుధం.!

-

గత ఎన్నికల ముందు వైఎస్ వివేకా హత్య జరిగిన విషయం తెలిసిందే. అయితే అది చేయించింది చంద్రబాబు, టి‌డి‌పి నేతలు అని జగన్ తో సహ వైసీపీ నేతలు ఆరోపించారు. కానీ ఎన్నికలయ్యాక జగన్ అధికారంలోకి వచ్చాక సీన్ మారుతూ వచ్చింది. దీనిలో బాబుతో సహ టి‌డి‌పి నేతల ప్రమేయం లేదని తేలుతూ వచ్చింది. అలాగే ఊహించని విధంగా  ఈకేసులో పలువురి అరెస్ట్ అయ్యారు. ఇదే క్రమంలో జగన్ మరో బాబాయి వైఎస్ భాస్కర్ రెడ్డిని తాజాగా సి‌బి‌ఐ అదుపులోకి తీసుకుంది.

అలాగే జగన్ సోదరుడు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని సైతం సి‌బి‌ఐ అదుపులోకి తీసుకుంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలో అవినాశ్ ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టుకు వెళ్లారు. ఇక తనకు బెయిల్ ఇవ్వకూడదని, ఈ కేసులో కుట్ర గురించి తెలుసుకోవడానికి విచారణ చేయాలని సి‌బి‌ఐ కౌంటర్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ లో వైఎస్ సునీతా కూడా ఇంకో పిటిషన్ వేశారు. ఇప్పుడు అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ వస్తుందా? లేక అరెస్ట్ అవుతారా? అనే చర్చ నడుస్తోంది.

ఇక ఏది జరుగుతుందో తెలియదు గాని..అవినాష్ రెడ్డి కోసం జగన్ రంగంలోకి దిగారని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన కీలక పర్యటనలు రద్దు చేసుకున్నట్లు తెలిసింది. ఈ నెల 21వ తేదీన ఆయన విదేశాలకు వెళ్ళాలి..ఇదే సమయంలో అనంతపురంలో పర్యటించాలి. కానీ జగన్ ఆ ప్రోగ్రాంలని రద్దు చేసుకున్నారు. తాజాగా వైసీపీలోని కీలక నేతలతో సమావేశమవుతున్నారు.

అయితే తన తమ్ముడుని కాపాడుకోవడానికి జగన్ కష్టపడుతున్నారని, కానీ వివేకా కేసులో న్యాయం జరుగుతుందని, చట్టం ముందు ఎవరు తప్పించుకోలేరని టి‌డి‌పి శ్రేణులు అంటున్నాయి. ఇక అవినాష్ ఎప్పుడు అరెస్ట్ అవుతారా? వైసీపీని కార్నర్ చేయడానికి టి‌డి‌పి రెడీగా ఉంది. మరి చూడాలి వివేకా కేసులో చివరికి ఏం జరుగుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news