భారత వజ్రాల వ్యాపారి నిరవ్ మోదీకి ఎదురు దెబ్బ తగిలింది. త్వరలో ఆయన ఇండియాకు రానున్నారు. నీరవు మోదీని ఇండియాకు అప్పగించాలని యూకే హైకోర్టు ఆదేశించింది. కాగా ప్రభుత్వ రంగ బ్యాంకు అయినా పంజాబ్ నేషనల్ బ్యాంకుకు సంబంధించి రూ. 13,500 కోట్ల రుణాలు ఎగవేత కేసులో నీరవ్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు.
భారత్ కు అప్పగింత ఆదేశాలను సవాలు చేస్తూ గతంలో అతడు దాఖలు చేసిన పిటిషన్ ను యూకే న్యాయస్థానం బుధవారం తోసిపుచ్చింది. దీంతో నీరవ్ మోదీని భారత్ తీసుకు వచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. వేలకోట్ల రూపాయల మోసం, మనీలాండరింగ్ కేసుల్లో నిరవ్ మోడీ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.