1500 మాస్కులతో పెండ్లి గౌను తయారు చేసిన బ్రిటీష్ డిజైనర్.. అవాక్ అయిన నేటిజన్లు..!

-

డిజైనర్లు పెళ్లికి బట్టలని క్లాత్ ని ఉపయోగించి మాత్రమే తయారు చేస్తారు. పైగా పెళ్లికి తయారు చేసే గౌను చాలా హెవీగా మంచి అందమైన క్లాత్ తో ఉంటుంది. కానీ ఈ పెండ్లి గౌను మాత్రం చాలా కొత్తగా ఉంది. దీన్ని చూస్తే తప్పక ఎవరైనా అవాక్ అవ్వాల్సిందే.

ఎందుకంటే ఈ గౌను సాదాసీదా గౌను కాదు. పైగా దీన్ని క్లాత్ తో కూడా తయారు చేయలేదు. మరి ఎలా చేశారా అని ఆశ్చర్యపోతున్నారా..? ఎలా అంటే… పదిహేను వందల ఫేస్ మాస్కులని ఉపయోగించి ఈ డిజైనర్ తయారు చేయడం జరిగింది. ఇక దీని కోసం పూర్తిగా చూస్తే..

 

View this post on Instagram

 

A post shared by Hitched (@hitcheduk)


యునైటెడ్ కింగ్డం లో కరోనా వైరస్ కి సంబంధించి రూల్స్ ఏమీ లేవు. అక్కడ ఉండే ప్రజలు ఎంతో ఆనందంగా ఉంటున్నారు. అయితే ఇక్కడ వెడ్డింగ్ ప్లానింగ్ ఏజెన్సీ టామ్ సిల్వర్ ఉడ్ తో కలిసి ఈ గౌను తయారు చేశారు.

మిగిలిపోయిన పీపీఈ మెటీరియల్స్ తో దీనిని చేయడంతో ప్రతి ఒక్కరూ అవాక్కవుతున్నారు. 1500 ఫేస్ మాస్కులుని ఈ గౌను తయారీలో ఉపయోగించారు. ఈ గౌను తో పాటు మాస్క్ తో జుట్టుకి హెయిర్ స్టైల్. అదే విధంగా చిన్న పూలగుత్తిని పట్టుకోవడం ఈ ఫోటోలో మనం చూడొచ్చు. నిజంగా ఇది నెట్టింట్లో వైరల్ గా మారిపోయింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా అవాక్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news