అమ్మ‌కానికి పెట్టిన కన్యత్వ పరీక్షలు..

-

బ్రిటన్ లోని ఏడు మెడికల్ క్లినిక్‌లు వివాదాస్పదమైన “కన్యత్వ పరీక్షలను” విక్రయిస్తున్నాయని బీబీసీ న్యూస్‌బీట్ జరిపిన దర్యాప్తులో తేలింది. అయితే ఈ కన్యత్వ పరీక్షలని మానవ హక్కుల ఉల్లంఘనగా ఐక్య రాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటున్నాయి. ఈ పరీక్షలు మహిళ కన్యత్వాన్ని నిర్ధరించలేవని, ఇది అశాస్త్రీయమైనవని విమర్శకులు అంటున్నారు. ఇది కూడా రకమైన వేధింపుల కిందకే వస్తుందని అంటున్నారు. ఈ పరీక్షల్లో మహిళల యోని పరీక్షించి హైమెన్ సరిగ్గా ఉందో లేదో చూస్తారట.

అంతే కాదు ఈ కన్యత్వ పరీక్షలు చేశాక అది లేకపోతే కన్యత్వాన్ని సరిదిద్దుతామని కూడా కొన్ని క్లినిక్ లు ప్రచారం చేసుకుంటున్నట్లు బీబీసీ చేసిన దర్యాప్తులో తేలింది. కన్యత్వ పరీక్షలు నిర్వహించే క్లినిక్ లు 7 దాకా ఉన్నట్లు బీబీసీ పరిశోధనలో తేలింది. అందులో కొంత మందిని బీబీసీ సంప్రదించగా, తాము కన్యత్వ పరీక్షలు చేస్తామని ఏడుగురు చెప్పారు. అయితే, మిగిలిన చాలాక్లీనిక్స్ వాళ్ళు ఈ పని గురించి బహిరంగంగా ఏమీ చెప్పలేదు. అయితే, హైమెన్ ని సరిదిద్దే శస్త్ర చికిత్స చేస్తామని వారంతా చెప్పారని తేలింది. 

Read more RELATED
Recommended to you

Latest news