రష్యా రెఫరెండంపై ఐరాస ఓటింగ్.. మళ్లీ దూరంగా ఉన్న భారత్

-

హెచ్చరికలన్నింటిని బేఖాతరు చేస్తూ పుతిన్ ఎట్టకేలకు తాను అనుకున్న పనే చేశారు. ఉక్రెయిన్ కు చెందిన నాలుగు భూభాగాలను రష్యాలో విలీనం చేశారు. రష్యా రెఫరెండంపై ఐరాస దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌కు చెందిన నాలుగు ప్రాంతాల్లో రష్యా తుపాకులతో బెదిరించి, ప్రజాభిప్రాయం చేపట్టిందని.. ఈ రెఫరెండం చెల్లదని ఐరాస ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ చర్యను ఖండించే తీర్మానంపై సర్వప్రతినిధి సభలో ఓటింగ్‌ నిర్వహించారు.

రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా పలు సేవలు, వస్తువుల ఎగుమతులపై బ్రిటన్‌ ఆంక్షలు విధించింది. పుతిన్‌ను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ పలు వ్యాఖ్యలు చేశారు. తప్పు చేయవద్దనీ.. రెఫరెండానికి, విలీనానికి చట్టబద్ధత లేదనీ అన్నారు. ఉక్రెయిన్‌కు అదనంగా సుమారు రూ.98 వేల కోట్ల (12 బిలియన్‌ డాలర్ల) సాయం అందించనున్నట్టు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news