ఉక్రెయిన్ భూభాగాల విలీనంపై​ త్వరలో పుతిన్ ప్రకటన

-

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం నెమ్మదిస్తోందనుకుంటున్న తరుణంలో సైనిక సేకరణతో పుతిన్ మరోసారి ప్రకంపనలు సృష్టించారు. ఇదే కాకుండా ఇప్పుడు పుతిన్ తీసుకున్న మరో నిర్ణయం భారీ విధ్వంసానికి మలుపు తీయనుంది. నాలుగు ఉక్రెయిన్‌ భూభాగాలను రష్యా విలీనం చేసుకునే ప్రక్రియ దాదాపు ముగింపునకు వచ్చింది.

ప్రజాభిప్రాయం మేరకు వాటిని తమ దేశంలో కలిపేసుకుంటున్నట్టు అధ్యక్షుడు పుతిన్‌ నేడో, రేపో ప్రకటన చేయనున్నారు. విలీనం చేసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికా సారథ్యంలోని నాటో ఘాటుగా హెచ్చరించినా.. ఆయన తగ్గడం లేదు. ఇరుపక్షాల నోటా అణ్వస్త్రాల మాట వినిపిస్తున్న వేళ.. తాజా పరిణామం ఎక్కడకు దారితీస్తుందోనన్న ఆందోళన ప్రపంచానికి వణుకు పుట్టిస్తోంది.

సరిహద్దులో ఉక్రెయిన్‌కు చెందిన దొనెట్స్క్‌, లుహాన్స్క్‌, జపోరిజియా, ఖేర్సన్‌లను తమ దేశంలో విలీనం చేసుకునేందుకు రష్యా రిఫరెండం పాచిక వేసిన సంగతి తెలిసిందే. ప్రజాభిప్రాయం పేరుతో ఈనెల 23-27 మధ్య అక్కడ ఓటింగ్‌ నిర్వహించారు. మాస్కోకు అనుకూలంగా ఓటింగ్‌ జరిగినట్టు చెబుతున్నా.. ఈ ప్రక్రియ అంతా పచ్చి బూటకమని ఉక్రెయిన్‌, అమెరికా సహా నాటో దేశాలు కొట్టిపారేశాయి. ప్రజలెవరూ స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితులు లేవని, రెఫరెండాన్ని అంగీకరించే సమస్యే లేదని తేల్చిచెప్పాయి. అయినా పుతిన్‌ వాటిని పెడచెవిన పెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news