వచ్చే ఏడాది చివరి వరకు ఉక్రెయిన్- రష్యా యుద్ధం… బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కీలక వ్యాఖ్యలు

-

రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభంమై రెండు నెలల కావస్తోంది. అయినా యుద్ధం తీవ్రత తగ్గడం లేదు. తూర్పు ప్రాంతమైన డాన్ బాస్ ప్రాంతంపై రష్యా టార్గెట్ చేసింది. ఇప్పటికే ఉక్రెయిన్ లో కీలక నగరం మరియోపోల్ ను స్వాధీనం చేసుకుంది. ఇదిలా ఉంటే భారత్ తో పర్యటిస్తున్న యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పుతిన్ వద్ద చాలా పెద్ద సైన్యం ఉందని.. యుద్ధం చేయడమే ఆయనకు ఉన్న ఏకైక ఎంపిక అని బోరిస్ జాన్సన్ అన్నారు. వచ్చే ఏడాది చివరి వరకు రష్యా యుద్ధం కొనసాగవచ్చని వెస్ట్రన్ ఇంటలిజెన్స్ అంచనా వేస్తుందని… యుద్ధంలో పుతిన్ గెలవచ్చని వ్యాఖ్యానించారు. అయితే ఉక్రెయిన్ ప్రజల స్ఫూర్తిని మాత్రం పుతిన్ జయించలేరని వ్యాఖ్యానించారు. కేవలం ఉక్రెయిన్ లో ఉన్న పరిస్థితులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిణామాలు యూకే, ఇండియా మరింత కీలకంగా పనిచేసేలా ప్రేరేపిస్తున్నాయంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికే రష్యాపై యూకే పలు ఆర్థిక ఆంక్షలు విధించింది. దీంతో పాటు ఉక్రెయిన్ కు మిలిటరీ సాయాన్ని అందిస్తోంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news