Ayushmann Khurrana: యాక్షన్ హీరోగా వెర్సటైల్ యాక్టర్..మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

-

టెలివిజన్ హోస్ట్, సింగర్‌గా ఉన్న ఆయుష్మాన్ ఖురానా..‘విక్కీ డోనర్’ చిత్రంతో హీరోగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆ తర్వాత వరుస సినిమాలు చేశారు. అయితే, అందరిలో ఒకరిలా కాకుండా విలక్షణమైన స్టోరిలను ఎంచుకుని వైవిధ్యభరితమైన పాత్రలను పోషించి..తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్నారు ఆయుష్మాన్ ఖురానా.

Kolkata: Bollywood actor Ayushmann Khurrana during a press conference for his upcoming movie Hawaizaada in Kolkata on Jan 27, 2015. (Photo:IANS)

‘అంధాధున్’ వంటి చిత్రంతో తాను వెర్సటైల్ యాక్టర్ అని ప్రూవ్ చేసుకున్నాడు ఆయుష్మాన్. అయితే, ఈ స్టార్ హీరో నటించిన గత చిత్రం ‘ఛండీఘర్ కరె ఆషికి’ అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ ఫిల్మ్స్ పైన ఫోకస్ చేశారు. ఆయుష్మాన్ ప్రస్తుతం ‘అనేక్, డాక్టర్ జీ, యాన్ యాక్షన్ హీరో’ చిత్రాలు చేస్తున్నాడు.

‘యాన్ యాక్షన్ హీరో’ ఫిల్మ్ రిలీజ్ డేట్ ను మేకర్స్ శుక్రవారం అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ పోస్టర్ షేర్ చేశారు. సదరు పోస్టర్ లో బ్లర్ మోడ్ లో బ్యాక్ గ్రౌండ్ లో ఆయుష్మాన్ కనిపిస్తున్నాడు. అలా ఈ పోస్టర్ ద్వారా సినిమాపైన ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువగా క్రియేట్ అయింది.

ఈ ఏడాది డిసెంబర్2న సినిమా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ అయ్యర్ దర్శకత్వం వహించారు. ఈయన సూపర్ హిట్ ఫిల్మ్స్ ‘తను వెడ్స్ మను రిటర్న్స్, జీరో’ చిత్రాలకుగాను దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news