ఉక్రెయిన్ అధ్యక్షుడి ప్రసంగానికి ఈయూ దేశాల స్టాండింగ్ ఒవేషన్… లొంగిపోమంటూ రష్యాకు వార్నింగ్

-

రష్యాకు మేం లొంగిపోయేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ. ఈ పోరాటంలో విజయం సాధిస్తామని ఆయన అన్నారు. యూరోపియన్ యూనియన్ సమావేశంలో ఆయన వర్చువల్ గా ప్రసంగించారు. ఈ సందర్భంలో వోలోడిమిర్ జెలెన్‌స్కీ ప్రసంగానికి స్టాండింగ్ ఒవేషన్ లభించింది. ఈయూ దేశాల ప్రతినిధులు నిలబడి జెలెన్ స్కీకి మద్దతు ప్రకటించారు. మా సత్తా ఏమిటో నిరూపించుకుంటామని రష్యాకు నేరుగా హెచ్చరికలు పంపాడు. ఈ పోరాటంలో విజయం సాధిస్తాం అని జెలన్ స్కీ ధీమా వ్యక్తం చేశారు. రష్యా సేనలతో మా పౌరులు ధైర్యంగా పోరాడుతున్నారని ఆయన అన్నారు. ఈ పోరాటంలో ఎంతకైనా వెళ్తాం అని ఆయన అన్నారు. రష్యా బాంబు దాడుల్లో 16 మంది చిన్నారులు చనిపోయారని ఆయన వెల్లడించారు. అసలు పుతిన్ లక్ష్యం ఏమిటని.. ప్రశ్నించారు. ఈయూ దేశాలు మద్దతు ఇస్తాయని ఆశిస్తున్నట్లు జెలన్ స్కీ అన్నారు. మా పిల్లలు ఆనందంగా జీవించాలన్నదే మా కోరిక అన్ని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలన్ స్కీ అన్నారు. “మన నగరాలన్నీ ఇప్పుడు రష్యా బ్లాక్ చేసింది… మేము మా భూమి మరియు స్వేచ్ఛ కోసం పోరాడుతున్నాము. మమ్మల్ని ఎవరూ విచ్ఛిన్నం చేయరు, మేము బలంగా ఉన్నాము. , మేము ఉక్రేనియన్లు.” అంటూ జెలన్ స్కీ నినదించారు.

Read more RELATED
Recommended to you

Latest news