కొత్త సంవత్సరంలో టీమిండియా మంచి శకునం ఎదురైంది. శ్రీలంకతో మూడు టీ 20ల సిరీస్ లో టీం ఇండియా శుభారంభం చేసింది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలో యువ ఆటగాళ్లతో సరికొత్తగా మారిన టి20 జట్టు మంగళవారం తొలి టీ20 లో రెండు పరుగుల తేడాతో లంకను ఓడించింది.
ఇక టీమిండియా బౌలింగ్ విషయానికి వస్తే, అరంగేట్ర బౌలర్ శివమ్ మావి అదరగొట్టాడు. ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్ కూడా రాణించారు. అయితే ఈ మ్యాచ్ లో శ్రీలంక బ్యాట్స్‌మెన్లకు వెన్నులో వణుకు పుట్టించాడు ఉమ్రాన్ మాలిక్.
155 స్పీడ్ తో వికెట్ తీసిన తొ లి బౌలర్ గా రికార్డ్ సృష్టించాడు ఉమ్రాన్ మాలిక్. 155కిలోమీటర్ల వేగంతో దసున్ షనకను అవుట్ చేశాడు ఉమ్రాన్ మాలిక్. దీంతో అత్యధికగా స్పీడ్ తో ఒక వికెట్ తీసిన బౌలర్ గా ఉమ్రాన్ చరిత్రలో నిలిచాడు. దీనికి సంబం ధించి న వీడియో వైరల్ అవుతోంది.
Fastest Delivery Of The Match Between Sri Lanka Vs India From Umran Malik In His 4th Over And 4th Ball https://t.co/7QX59gj9Ua
— Talim Hussain (@_TalimHussain) January 4, 2023