ఉక్రెయిన్ యుద్ధంలో ఊహించని ట్విస్ట్..!!

-

ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ తరుణంలో మంగళవారం ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తీరును తప్పుబడుతూ.. ఉక్రెయిన్ తాజా ప్రకటన విడుదల చేసింది. అంతర్జాతీయ అణుశక్తి (ఐఏఈఏ) చీఫ్ రఫేల్ గ్రాస్సీ దక్షిణ ఉక్రెయిన్‌లోని జాపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్‌కు ప్రతినిధుల బృందాన్ని పంపనుంది. ఈ చర్యలను తప్పుబడుతూ.. ఉక్రెయిన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ సంస్థ చీఫ్‌కు ప్లాంట్‌లో అనుమతి లేదని ఆదేశాలు జారీ చేసింది.

ukraine-zaporozhye-nuclear
ukraine-zaporozhye-nuclear

యూరప్‌లోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం అయిన జాపోరిజ్జియా దురాక్రమణల నేపథ్యంలో రష్యా బలగాల చేతుల్లోకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి రష్యా, ఉక్రెయిన్ బలగాలు ఈ ప్లాంట్‌పై ఆధిపత్యం కోసం పోరాడుతోంది. ఈ సందర్భంగా ఐఏఈఏ చీఫ్ రఫెల్ గ్రాసీ మాట్లాడుతూ.. ఇంటర్నేషనల్ మిషన్‌లో భాగంగా నిపుణులతో కూడిన బృందాన్ని జాపోరిజ్జియాకు పంపనుంది. ఈ మేరకు ఐఏఈఏ బృందం ప్లాంట్‌లో పర్యటించడాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని కీవ్ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ తీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news