రచయితగా రజనీకాంత్..‘తలైవర్ 169’కి స్టోరి ఇస్తున్న సూపర్ స్టార్!

-

తమిళ్ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రేక్షకులకు చివరగా ‘అన్నాత్తె’ చిత్రంలో కనిపించారు. తెలుగులో ఈ సినిమా ‘పెద్దన్న’ పేరుతో విడుదలైంది. అయితే, ఈ ఫిల్మ్ అనుకున్న స్థాయిలో ఆడలేదు. కాగా, నెక్స్ట్ రజనీ మూవీపై ఫుల్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో తెరకెక్కనున్న తలైవర్ 169 అప్ డేట్ కోసం అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే కోలీవుడ్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం..ఈ చిత్రానికి తలైవా రజనీకాంత్ స్టోరి అందిస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి నెల్సన్ దర్శకత్వం వహిస్తుండగా స్క్రీన్ ప్లే కే.ఎస్.రవికుమార్ అందిస్తున్నారని వార్తలొస్తున్నాయి.అయితే, ఈ చిత్రానికి మ్యూజిక్ అనిరుధ్ ఇస్తున్నారని అఫీషియల్ గా కన్ఫర్మేషన్ అయింది. కానీ, సూపర్ స్టార్ రజనీ స్టోరి, రవికుమర్ స్క్రీన్ ప్లే గురించి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు.

సన్ పిక్చర్స్ వారు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. తలపతి విజయ్ తో ‘బీస్ట్’ వంటి యాక్షన్ ఫిల్మ్ చేసిన నెల్సన్ దిలీప్..ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ తో సినిమా చేస్తున్నారు. వచ్చే నెల నుంచి ఈ పిక్చర్ షూటింగ్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news