తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే వ్యవసాయరంగ సమస్యలన్నీ పరిష్కరిస్తాం : కిషన్ రెడ్డి

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో వ్యవసాయం దండగ అనే పరిస్థితి నెలకొందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఖమ్మంలో బీజేపీ ఆధ్వర్యంలో రైతు గోస-బీజేపీ భరోసా పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభ వేదికగా కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. నిజాం హయాంలో రజాకార్లు హిందువులను ఏవిధంగా ఊచకోత కోశారో ప్రజలందరికీ తెలుసు అన్నారు. అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ గా పేరుపొందిన అమిత్ షా నేతృత్వంలో తొలిసారిగా తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహించుకోవడం జరిగిందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు.. తెలంగాణ విమోచన ఉత్సవాల విషయంలో నిర్లక్ష్యం వహించాయని మండిపడ్డారు కిషన్ రెడ్డి. 

రైతులకు ఉచిత ఎరువులు ఎందుకు ఇవ్వరో కేసీఆర్ చెప్పాలి. తూతూ మంత్రంగా రుణమాఫీ చేస్తున్నరు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని పేర్కొన్నారు. ధరణి పోర్టల్ తో దాదాపు 20 లక్షల మంది రైతులు మోసపోతున్నారు. థరణి పోర్టల్.. ఉన్న నాలుకకు మందు వేస్తే కొండనాలుక పోయినట్టుగా మారిందని విమర్శించారు కిషన్ రెడ్డి.  తెలంగాణ బీఆర్ఎస్ కి ఓటేస్తే.. కాంగ్రెస్ కి వేసినట్టే.. రెండు ఒక్కటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయ రుణాలను పావులా వడ్డీకి ఇవ్వడం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news