కేంద్ర మంత్రి నారాయణ రాణే అరెస్ట్ !

-

కేంద్ర మంత్రి నారాయణ రానే చిక్కుల్లో పడ్డారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ థాక్రే పై అనుచిత వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి నారాయణ రానే. అసలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కు దేశమంటే విలువ లేదని… భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది అనే విషయం కూడా తెలియదని సంచలన వ్యాఖ్యలు చేశారు నారాయణ రానే. అంతేకాదు… స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో తెలియని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే చెంప చెళ్లు మనిపించాలని కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అయితే కేంద్ర మంత్రి నారాయణ రాణే చేసిన వ్యాఖ్యలపై శివసేన పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతేకాదు కేంద్ర మంత్రి నారాయణ రాణే కేసు కూడా పెట్టారు. శివసేన కార్యకర్తల…. ఆరోపణలతో మహారాష్ట్ర పోలీసులు కేంద్ర మంత్రి నారాయణ పై నాలుగు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు.  ఇక కేంద్రమంత్రి నారాయణ రాణే ను ఈ కేసులో ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసులో నేపథ్యంలో… ముందస్తు బెయిల్ కోసం రత్నగిరి కోర్టును ఆశ్రయించారు కేంద్రమంత్రి నారాయణ రాణే. అయితే కేంద్ర మంత్రి బెయిల్ పిటిషన్ ను రత్నగిరి కోర్టు రద్దు చేసింది. దీంతో…. కేంద్ర మంత్రిని ఏ క్షణమైనా అరెస్టు చేయవచ్చని పోలీసులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news