ఆన్ లైన్ చెల్లింపుల్లో మార్పులు.. 16అంకెల నంబర్ ఎంటర్ చేయాల్సిందే.. ఆర్బీఐ.

-

ఆన్ లైన్లో చెల్లింపులు చేసే అలవాటు అందరికీ వచ్చేసింది. అదే పనిగా ఆన్ లైన్ లో కొనుక్కోవడం అలవాటైన మూలంగా ఈ లావాదేవీలు విపరీతంగా పెరిగాయి. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు ఉపయోగించి ఎప్పటికప్పుడు ఆన్ లైన్ ట్రాన్షాక్షన్స్ జరుగుతున్నాయి. ఐతే ప్రస్తుతం ఈ ఆన్ లైన్ చెల్లింపుల విధానంలో ఆర్బీఐ మార్పులు తీసుకురాబోతుంది. ఇకపై ఆన్ లైన్లో ఏ లావాదేవీ జరిపినా 16అంకెల నంబరు తో పాటు సీవీవీ కూడా ఎంటర్ చేయాల్సిందే అని తీర్మానించింది.

మోసాలకు చెక్

అది క్రెడిట్ కార్డ్ అయినా, డెబిట్ కార్డ్ అయినా.. కార్డుకి సంబంధించిన 16అంకెల నంబరుని ఎంటర్ చేసాకే లావాదేవీ పూర్తవుతుందని తెలిపింది. దీనివల్ల పెద్ద పెద్ద కంపెనీలు తమ వినియోగదారుల ఖాతా వివరాలను నిల్వ చేసుకునే సౌకర్యం ఉండదు. అది వినియోగదారుడికి కలిసి వచ్చే అంశం. వినియోగదారుడి వ్యక్తిగత వివరాలతో పాటు ఖాతా వివరాలు కంపెనీ సర్వర్లోనే ఉంచుకునే అవకాశం ఇకపై ఉండదు. దీనివల్ల సాంకేతికత సాయంతో జరిగే మోసాలను అరికట్టవచ్చు.

ఇంతకు ముందులా కేవలం సీవీవీ ఎంటర్ చేసి లావాదేవీ పూర్తి చేసుకునే అవకాశం లేదు. 16అంకెల నంబరు, సీవీవీ ఇంకా గడువు సమయం ఎంటర్ చేసాకే ట్రాన్సాక్షన్ పూర్తి అవుతుంది. ఎన్ని సార్లు ఆన్ లైన్ చెల్లింపులు చేసినా ఇదే నియమం వర్తిస్తుంది.

జనవరి నుండి అమల్లోకి

ఈ సరికొత్త ఆర్బీఐ విధానం ఇప్పుడే అమల్లోకి రావట్లేదు. వచ్చే ఏడాది జనవరిలో అమల్లోకి రానుంది. నిజానికి ఆర్బీఐ నిర్ణయం ప్రకారం ఈ ఏడాది జులైలో అమల్లోకి రావాలి. కానీ సాంకేతిక కారణాలు, బ్యాంకులు సిద్ధంగా లేకపోవడం మొదలగు కారణాల వల్ల జనవరికి వెళ్ళింది. ఏదైతేనేం కార్డు వివరాలు కంపెనీల సర్వర్లలో ఉండకుండా భద్రత దొరుకుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news