ఇది రాజకీయ సమస్య కాదు.. పంట వ్యర్థాల కాల్చివేతపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు

-

దేశ రాజధాని దిల్లీని వాయు కాలుష్యం పీడిస్తోంది. దీనికి ప్రధాన కారణం సమీప రాష్ట్రమైన పంజాబ్ తదితర ప్రాంతాల్లో పెరుగుతోన్న పంట వ్యర్థాల కాల్చివేత. ఈ ఘటనలపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రాజకీయ సమస్య కాదని, దీన్ని అరికట్టేందుకు సంబంధిత రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.

‘రూ.కోట్ల నిధులు, యంత్రాలు అందించినా.. పంట వ్యర్థాల దహనం ఘటనలు పెరుగుతుండటం ఆందోళనకరం’ అని కేంద్ర మంత్రి అన్నారు. ‘ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం 2018-19 నుంచి ఇప్పటివరకు  పంజాబ్, దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, హరియాణాలకు రూ.3,138 కోట్లు అందించింది. అత్యధికంగా పంజాబ్‌కు రూ.1,400 కోట్లు కేటాయించింది’ అని వెల్లడించారు.

ఉత్తర్‌ప్రదేశ్, హరియాణాలు మంచి ఫలితాలు రాబట్టాయని, ఈ విషయంలో అవి సానుకూల దిశలో పయనిస్తున్నట్లు చెప్పారు. దాదాపు రెండు లక్షల డీకంపోజర్లను రాష్ట్రాలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. వీటిని సమర్థంగా వినియోగించుకోవాలి’ అని విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news