ఆధార్ అప్‌డేట్‌పై కొత్త ట్విస్ట్‌..

-

ఆధార్ అనేది ఇప్పుడు నిత్య జీవితంలో భాగమైపోయింది.  అన్ని ప్రభుత్వ సేవలకు ఆధార్ కార్డులు తప్పనిసరి. ఆధార్ కార్డు ఇప్పుడు ఎంతో కీలకమైన డాక్యుమెంట్. ఆధార్ కార్డులో వివరాల అప్డేట్‌కు కొన్ని డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. అయితే కొన్ని సందర్భాల్లో డాక్యుమెంట్లు లేకుండానే ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. యూఐడీఏఐ తాజాగా ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.

ఫోటోగ్రాఫర్, బయోమెట్రిక్, జండర్, మొబైల్ నెంబర్, ఈ మెయిల్ ఐడి వంటి వివరాల అప్డేట్‌కు ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం ఉండదు. దీనికి కేవలం ఆధార్ కార్డు తీసుకొని దగ్గరిలోనే ఆధార్ కేంద్రానికి వెళితే చాలు పని పూర్తవుతుంది. ఆధార్ వివరాల అప్డేట్ కు సంబంధించి యూఐడీఏఐ మరో ట్విట్ చేసింది. పేరు, అడ్రస్, పుట్టిన తేదీ వంటి వివరాలు అప్డేట్‌కు మాత్రం డాక్యుమెంట్లు అవసరమని పేర్కొంది. ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం యూఐడీఏఐ వివరంగా తెలియజేసింది.


మరోవైపు ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆన్‌లైన్‌ అపాయింట్‌మెంట్ బుకింగ్ ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏడు పట్టణాల్లో  కొత్తగా ఏర్పాటు చేసిన ఆధార్ సేవా కేంద్రాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. దీంతో మీరు ఆధార్ సెంటర్‌లో పని ఉంటే ముందుగానే అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. యూఐడీఏఐ ఇప్పుడు ఢిల్లీ,  భోపాల్, ఆగ్రా, చెన్నై, విజయవాడ, ఛండీగఢ్‌, హిస‌ర్‌ వంటి పలు ప్రాంతాల్లో కొత్తగా ఆధార్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది.

ఇవి పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల మాదిరిగా ఉంటాయి. యూఐడీఏఐ ఇంకా ఇతర పట్టణాల్లోనూ కొత్త సెంటర్లును కూడా ఏర్పాటు చేస్తోంది. త్వరలోనే దేశవ్యాప్తంగా ఉన్న 53 ప‌ట్ట‌ణాల్లోని 114 సెంటర్లలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇవి ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వారంలో మంగ‌ళ‌వారం మిన‌హా ఆరు రోజులు పనిచేస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news