మోహన్ బాబు ఇంటిలోకి దూసుకెళ్లి.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన దుండగులు..!

సినీ నటుడు మోహన్‌ బాబు ఇంటి దగ్గర కారు కలకలం రేగింది. ఆయన ఇంట్లోకి ఓ గుర్తుతెలియని కారు దూసుకెళ్లింది. మిమ్మల్ని వదలమంటూ దుండగులు హెచ్చరించి వెళ్లారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు పహాడిషరీఫ్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో మోహన్‌బాబు ఇంటి వాచ్‌మెన్ అప్రమత్తంగా లేనట్లు తెలిసింది. ఏపీ 31 ఏఎన్‌ 0004 ఇన్నోవా కారులో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగులు ఎవరు… మోహన్ బాబు  ఫ్యామిలీ ఎందుకు హాని తలపెట్టాలని అనుకున్నారు.

ఇది శతృవులు చేసిన పనేనా లేక ఆకతాయిలు చేసిన పనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆ దుండగులు వాడిన కారు విజయలక్ష్మి అనే మహిళ పేరుపై రిజిస్టర్ అయినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే మోహన్ బాబు కుటుంబ సభ్యులు మీడియా ముఖంగా స్పందించకపోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.