ఐఖ్యరాజ్య సమితి సంచలన ప్రకటన… ఎప్పుడూ చూడని సంక్షోభం…!

-

కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తున్న నేపధ్యంలో ఐఖ్యరాజ్య సమితి సంచలన ప్రకటన చేసింది. ప్రపంచం రానున్న రోజుల్లో అత్యంత సవాల్ తో కూడుకున్న సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని ఐక్యరాజ్య సమితి(ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. రెండో ప్రపంచం యుద్ధం తర్వాత ఈ స్థాయి మాంద్యాన్ని ఎప్పుడూ చూసి ఉండి ఉండమని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం మానవాళిని పట్టిపీడిస్తున్న కొవిడ్‌-19, ఆర్థిక రంగంపై దాని ప్రభావం అత్యంత అస్థిరత, అశాంతి, ఆందోళనలకు దారితీయబోతోందని ఆయన ప్రకటన చేసారు. సామాజికార్థిక పరిస్థితులపై కొవిడ్‌-19 ప్రభావం’పై నివేదిక విడుదల చేసారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. కొవిడ్‌-19పై పోరును ప్రపంచ దేశాలు మరింత ఉద్ధృతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

రాజకీయ పంతాలకు పక్కనబెట్టి ప్రపంచ దేశాలు ఏకతాటిపైకి వస్తేనే ఈ మహమ్మారి సృష్టించే ఉత్పాతాన్ని సమర్థంగా ఎదుర్కోగలమని ఆయన పేర్కొన్నారు. ఐరాస 75 ఏళ్ల చరిత్రలో ఈ స్థాయి ఆరోగ్య సంక్షోభాన్ని ఎప్పుడూ చూడలేదని సదరు నివేదికలో పేర్కొనడం గమనార్హం. కేవలం ఆరోగ్య రంగానికే పరిమితం కాకుండా మానవ సంక్షోభానికి కూడా దారితీస్తుందని… కొవిడ్‌-19ని ఎదుర్కోవడానికి చేపట్టాల్సిన చర్యల్లో ఇంకా చాలా వెనకబడి ఉన్నామని ఆయన వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news