లోక్ సభ సభ్యత్వానికి అఖిలేష్ యాదవ్ రాజీనామా…

-

ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ ఛీఫ్ అఖిలేష్ యాదవ్, మరో కీలక నేత ఆజాంఖాన్ తమ లోక్ సభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఈరోజు పార్లమెంట్ లో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు రాజీనామా లేఖలను అందించారు. కాగా ఆజాంఖాన్ రాజీనామాను స్పీకర్ అంగీకరించారు.  ఇటీవల జరిగిన ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కర్హాల్ నుంచి పోటీ చేసిన అఖిలేష్ 67 వేల పైగా మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి బీజేపీ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి ఎస్పి బఘేల్ ఓడించారు. మరోవైపు ఎస్పీ కీలక నేత ఆజాంఖాన్ రాంపూర్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ నేత ఆకాష్ సక్సేనాపై 55,000 ఓట్ల తేడాతో ఓడించాడు.

ప్రస్తుతం వీరిద్దరు  ఇప్పటికే లోక్ సభ సభ్యులుగా ఉంటూ.. అసెంబ్లీకి పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం అఖిలేష్ ఆజాంఘడ్ నుంచి, ఆజాంఖాన్ రామ్ పూర్ లోక్ సభ స్థానాలకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే తాాజాగా వీరిద్దరు రాష్ట్ర శాసన సభలో సభ్యులుగా ఉండటానికి ప్రాధాన్యత ఇచ్చారు. గతంలో వీరిద్దరు అసెంబ్లీ స్థానాలకు రాజీనామా చేస్తారనే వార్తలు వినిపించినా… చివరకు లోక్ సభకు రాజీనామా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news