మరో మూడు నెలల్లో ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికలు ముంచుకోస్తున్నాయి. 2022 ఫిబ్రవరిలో ఎన్నికలుజరగునున్నాయి. ఇప్పటికే ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ వినూత్న హామీలను ఇస్తూ ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అలాగే ఎస్పీ నుంచి అఖిలేష్ యాదవ్, బీఎస్పీ నుంచి మాయావతి తమ తమ వ్యూహాలతో సిద్దంగా ఉన్నారు. మరో వైపు బీజేపీ కూడా తన ఎన్నికల వ్యూహాలకు పదును పెట్టారు. తాజాగా పెట్రోల్ ధరలను భారీగా తగ్గిస్తూ యూపీలోని యోగి ఆదిత్య నాథ్ నిర్ణయం తీసుకున్నారు. యూపీ ఎన్నికల ముందు బీజేపీ తీసుకున్న నిర్ణయం ఓట్లను కురిపిస్తుందని ఆపార్టీ భావిస్తోంది.
అయితే తాజాగా శుక్రవారం రోజు యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఆదేశించిన తర్వాతే పోటీలోకి దిగుతానని వ్యాఖ్యానించారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేసే అంశంపై బీజేపీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. పార్టీ నిర్ణయం తర్వాతే తాను ఏ స్థానం నుంచి పోటీ చేసే విషయంపై స్పష్టత వస్తుందన్న యోగి ఆదిత్యానాథ్.. ఏ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలనేది బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు.