పునీత్ మరణాన్ని క్యాష్ చేసుకుంటున్న కేటుగాళ్లు..!

కొంతమంది ప్రతిదాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తుంటారు. ఆఖరికి చావును కూడా డబ్బు చేసుకోవాలనే ఆలోచనలో కొంతమంది కేటుగాళ్లు క్రియేటివిటీని ప్రదర్శిస్తారు. తాజాగా బెంగళూరులో ఓ డయాగ్నొస్టిక్ సెంటర్ నిర్వాహకులు అలాంటి చావు తెలివితేటలే ఉపయోగించారు. బెంగళూరుకు చెందిన ఓ డయాగ్నొస్టిక్ సెంటర్ పునీత్ మరణంపై సంతాపం ప్రకటిస్తూ ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది.

అయితే ఈ ఫ్లెక్సీలో ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఫ్రీగా అందరికీ గుండె కు సంభందించిన టెస్టులు చేస్తామని పేర్కొంది. ఇది ఇలా ఉండగానే దానికింద గమనించినట్లయితే మా వద్దకు మీరు కొలెస్ట్రాల్ చెకప్, బిపి, ఈసీజీ చెకప్ లు చేయించుకుంటే కేవలం 300 చెల్లించాలని ప్రకటించింది. ప్రస్తుతం డయాగ్నోస్టిక్ సెంటర్ చేసుకున్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో పునీత్ రాజ్ కుమార్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.