ఉపాసన@ డెస్క్ కోర్డినేటర్

మెగాస్టార్ చిరంజీవి కోడలు,.మెగా  పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఓ ఉద్యోగంలో చేరారట. ఈ విషయాన్ని తానే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ ఏటా నిర్వహించే సమావేశంలో భాగంగా ఉపాసన ఇటీవల దావోస్‌కు వెళ్లిన సందర్భంగా… తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న కంపెనీలకు రాష్ట్రం గురించి, ఇక్కడ ఉన్న పాలనా వ్యవహారాల గురించి సమాచారం అందించి తనవంతు సాయం చేసేందుకు ఫోరంలోని తెలంగాణ డెస్క్‌కు కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు. అయితే ఇదే విషయాన్ని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కి నివేదిస్తూ…


 

‘నా కొత్త ఉద్యోగం ఎలా ఉంది కేటీఆర్‌ సర్‌? వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సమావేశం నిమిత్తం దావోస్‌ వెళ్లాను. సమాచారం అందించేందుకు ఇక్కడి ‘ఇన్వెస్ట్‌‌ తెలంగాణ’‌ డెస్క్‌లో కూర్చున్నాను’ అని వెల్లడిస్తూ కొన్ని ఫొటోలను పోస్ట్‌ చేశారు. ఇందులో భాగంగా … మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్లతో కలిసి దిగిన ఫోటోను సామాజిక మధ్యమంలో షేర్ చేస్తూ..సో ప్రౌడ్ అంటూ ట్వీట్ చేశారు.