కరోనా వైరస్ కి శరవేగంగా వ్యాప్తిచెందుతూ సినీ ప్రముఖులపై కూడా పంజా విసురుతున్న విషయం తెలిసిందే ఇటీవలే మిల్కీ బ్యూటీ తమన్నా కరోనా వైరస్ బారిన పడ్డారు. హైదరాబాద్ లో ఓ వెబ్ సిరీస్ లో షూటింగ్ లో పాల్గొంటున్న సమయంలో మిల్కి బ్యూటీ తమన్నా కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన తమన్నా అతి తక్కువ సమయంలోనే కోలుకున్నారు. దీంతో అభిమానులు అందరూ ఖుషి అయ్యారు.
అయితే ఈ సందర్భంగా తాను త్వరగా కోలుకోవడానికి సహకరించిన ఓ వ్యక్తికి కృతజ్ఞతలు తెలిపారు మిల్కీ బ్యూటీ తమన్నా. ఆ వ్యక్తి ఎవరో కాదు కొణిదెల వారి కోడలు… రామ్ చరణ్ సతీమణి ఉపాసన. తమన్నా ఉపాసన మధ్య మంచి స్నేహ బంధం ఉంది అన్న విషయం తెలిసిందే. వెంటనే అపోలో లో చేర్పించి చికిత్స చేయడమే కాకుండా తమన్నా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.. అందుకే తాను త్వరగా కోలుకోగలిగాను అంటూ చెప్పుకొచ్చింది తమన్నా. కోలుకున్న తర్వాత ఉపాసనకు థ్యాంక్స్ చెప్పింది.