UPSC సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి

-

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సివిల్ సర్వీసెస్ 2024 మెయిన్ పరీక్షల ఫలితాలు ఇటీవల విడుదల విషయం తెలిసిందే. సెప్టెంబర్ 20, 21, 22, 28, 29 తేదీలలో మెయిన్ పరీక్షలు జరగగా.. డిసెంబర్ 09న ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 2,845 మంది అభ్యర్థులు తదుపరి దశకు ఎంపికయ్యారు. తాజాగా ఇంటర్వ్యూ తేదీలను యూపీఎస్సీ వెల్లడించింది. వచ్చే ఏడాది జనవరి 07 నుంచి ఏప్రిల్ 17వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

అభ్యర్థుల రోల్ నెంబర్, ఇంటర్వ్యూ తేదీ, సమయానికి సంబంధించిన పూర్తి వివరాలను UPSC అధికారిక వెబ్ సైట్ లో ప్రకటించింది. త్వరలోనే ఇ-సమన్ లెటర్లు వెబ్ సైట్ లో పొందుపరచనున్నట్టు వెల్లడించింది కమిషన్. ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన వారిని మాత్రమే ఇంటర్వ్యూకి అనుమతిస్తారు. ఈ ఏడాదికి 1056 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు UPSC నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. గత ఏడాది తెలంగాణ, ఏపీ నుంచి దాదాపు 60 మంది వివిధ సర్వీసులకు ఎంపికయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news