అయ్యో పాపం.. పిల్లిని కూడా వదలని అధికారులు.. లక్షల్లో ఫైన్..!

-

ఒకప్పుడు కుక్కలను, కుందేలను పెంపుడు జంతువులుగా పెంచుకోనేవాళ్ళు.కానీ ఇప్పుడు కాస్త ట్రెండ్ మారింది.పిల్లులను, పందులను కూడా పెంచుకుంటున్నారు.అయితే ఇంట్లో పెరిగే జంతువులు ఇంట్లోనే ఉండాలనే రూల్ అయితే లేదు..బయట తిరిగి సాయంత్రానికి ఇంటికి వస్తాయి.ఈ విషయాన్ని మన దేశంలో అయితే పెద్దగా పట్టించుకోరు.కానీ విదేశాల్లో మాత్రం వీటిని సీరియస్ గా తీసుకోవడం తో పాటు కేసును పెడతారు..అమెరికా లాంటి పెద్ద దేశాలలో అయితే ఎవరైనా ఒక పిల్లినో.. కుక్కనో పెంచుకుంటూ అది ఇతరుల అనుమతి లేకుండా వారి ఇంట్లోకి వెళ్లరాదు. వేరే జంతువులతో పోట్లాడరాదు.

 

అందుకే అమెరికాలో ఓ పిల్లి అనుమతి లేకుండా పొరుగు వారిళ్లలోకి వెళ్లుతున్నదని, ఇతర ఇరుగు పొరుగు జంతువులను వేధిస్తున్నదనే ఫిర్యాదు అధికారులకు అందింది. ఆ విషయంపై పిల్లి యజామానికి హెచ్చరికలు జారీ చేశారు. ఆ పిల్లి తీరు మారక పోవడంతో పిల్లిని జైలుకు కూడా పంపారు.ఆ పిల్లి యజమానికి ఫైన్లు వేశారు. దీంతో ఆ పిల్లి యజమాని కోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ సంస్థలపై దావా వేసింది. దీంతో మూడేళ్లపాటు విచారణ సాగింది. చివరకు ఆ పిల్లి ఆరోపణల్లో పేర్కొన్నట్టుగా ఉల్లంఘనలేవీ చేయలేదని కోర్టు నిర్ధారించింది. చివరకు ఆ యజమానికి రూ. 95 లక్షలు అందించే సెటిల్‌మెంట్‌ను కోర్టు చేసింది..

ఈ ఘటన అమెరికాలోని వాషింగ్టన్‌లో అన్నా డేనియలీ అనే మహిళ నివసిస్తున్నది. ఆమె ఒక పిల్లిని పెంచుకుంటున్నది. ఆ పిల్లి పేరు మిస్కా. ఆ మిస్కా పొరుగు ఇళ్లకు వెళ్లి గందరగోళం చేస్తున్నదని, అంతేకాదు, ఇరుగు పొరుగు జంతువులను హరాస్ చేస్తున్నదని అధికారులకు స్థానికులు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు ఒక సారి ఆ మిస్కాను కిట్టీ జైలుకు బలవంతంగా తీసుకెళ్లారు. పిల్లి యజమాని కోర్టును ఆశ్రయించింది. అందులో భాగంగా అధికారులు విచారణ జరిపారు. పిల్లి తప్పు లేదని తేలడంతో 95 లక్షల సెటిల్‌మెంట్ చేయాలని ఆదేశించింది.. మొత్తానికి పిల్లికి ఏ పాపం తెలియదని తేలింది..అది పిల్లి స్టోరీ..

Read more RELATED
Recommended to you

Latest news