రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. రష్యా మరింత దూకుడుగా.. రాజధాని కీవ్ ను ఆక్రమించే ప్రయత్నం చేస్తోంది. క్షిపణులతో దాడులకు తెగబడుతోంది. ఇదిలా ఉంటే రష్యాపై కీలక ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఉక్రెయిన్ తరుపున అమెరికా యదు్ధం చేయదని ఆయన స్పష్టం చేశాడు. అమెరికాలో అన్ని రష్యన్ విమానాలపై నిషేధాన్ని విధించారు. తమ గగనతలంలోకి రష్యా విమానాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పుతిన్ రాజధాని కీవ్ ను ట్యాంకులతో చుట్టుముట్టవచ్చు కానీ.. ఉక్రెయిన్ ప్రజల మనసులను గెలుచుకోలేడని జో బైడెన్ అన్నారు. స్వేచ్చ ప్రపంచం సంకల్పాన్ని పుతిన్ ఎప్పటికీ బలహీనపరచలేరని ఆయన అన్నారు. అమెరికా, దాని మిత్ర దేశాలు రక్షణకు నాటో ప్రతి అంగుళాన్ని రక్షించుకుంటుందని బైడెన్ అన్నరు. ఉక్రెయిన్లు ధైర్యంతో పోరాడుతున్నారని.. ఉక్రెయిన్ కు మా మద్దతు ఉంటుందని అన్నారు. పుతిన్ యుద్ధంతో లాభ పడవచ్చు కానీ.. దీర్ఘకాలంలో ఆయన తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని బైడెన్ వార్నింగ్ ఇచ్చారు.