క్రెడిట్ కార్డును ఇలా వాడుతున్నారా? అయితే భారీగా నష్ట పోతారు జాగ్రత్త..

-

క్రెడిట్ కార్డు దాదాపు అందరికి దగ్గర ఉంటుంది.. బెనిఫిట్స్ సంగతి పక్కన పెడితే..ముందు వాడుకొని తర్వాత డబ్బులు కట్టొచ్చు.. అందుకే ఎక్కువ మంది అవసరం ఉన్నా లేకున్నా తీసుకుంటున్నారు. ఇక అన్ని బ్యాంకులు కూడా క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నారు.. దాంతో వాటి వినియోగం నానాటికి పెరుగుతూ వస్తుంది.. కార్డు చేతిలో ఉంది కదా అని వాడితే.. దారుణంగా నష్ట పోతారు.. అయితే క్రెడిట్ కార్డును ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం..

 

క్రెడిట్‌ కార్డు వాడకం విధానం తెలిసి ఉండాలి. కార్డులో డబ్బులు ఉన్నాయి కదా అని ఇష్టానుసారంగా వాడితే ఇబ్బందుల్లో చిక్కుకుంటారు. గడువులోగా కార్డు బిల్లు చెల్లిస్తే మేలు.. లేకపోతే అప్పుల పాలు కావాల్సిన పరిస్థితి ఎదురవుతుంటుంది. ఎందుకంటే వడ్డీ, ఇతర ఛార్జీలు అంటూ భారీగా వడ్డించనున్నాయి బ్యాంకులు. అందుకే క్రెడిట్‌ కార్డులు వాడే వారు జాగ్రత్తలు పాటించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఇక గడువులోగా బిల్లు చెల్లించకపోతే క్రెడిట్‌ స్కోర్‌ తగ్గిపోయే అవకాశం ఉంది.. భవిష్యత్ లో ఎప్పుడైనా ఋణం తీసుకోవాలి అనుకుంటే తీసుకోలేరు..

అలాగే సమయానికి బిల్లు చెల్లిస్తూ సరిగ్గా వాడుకుంటే రుణాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇలాంటి వారు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే. రుణాలు తీసుకున్న వారు, క్రెడిట్‌ కార్డు ఉపయోగిస్తున్నవారి క్రెడిట్‌ స్కోర్‌ అనేది చాలా ముఖ్యం.లోన్ తీసుకొనే వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా క్రెడిట్‌ బ్యూరోలు క్రెడిట్‌ స్కోర్‌ అందిస్తాయి. క్రెడిట్ స్కోరు ఎక్కువగా ఉంటే, భవిష్యత్తులో తక్కువ రేట్లతో రుణం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి…

రుణం లేదా క్రెడిట్ కార్డ్ బకాయిలు సమయానికి చెల్లించకపోతే మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ, మీ స్కోర్‌ను ప్రభావితం చేసే అనేక ఇతర అంశాలు ఉన్నాయి. వాటిపై అందరికీ అవగాహన తక్కువగా ఉంటుంది. వేరొకరికి రుణాలు ఇప్పిస్తే మీకు స్కోర్ తగ్గుతుంది.పూర్తి బిల్లు చెల్లించకుండా కేవలం మినిమమ్‌ బిల్లు చెల్లిస్తే కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంటుంది. దీని వల్ల మీకు వడ్డీ, జీఎస్టీ, ఇతర ఛార్జీలు విధిస్తుంటాయి బ్యాంకులు. ఇలా మినిమమ్‌ బిల్లు జోలికి వెళ్లకుండా పూర్తి బిల్లు చెల్లిస్తేనే మంచిది. మనం క్రెడిట్ కార్డు నుంచి ఎంత ఖర్చు చేసిన మొత్తం బిల్లు సమయానికి చెల్లిస్తే మంచిది..

Read more RELATED
Recommended to you

Latest news