గవర్నర్ విమర్శించినా, హై కోర్ట్ చివాట్లు పెట్టినా కేసీఆర్ కు సిగ్గోస్తలేదు అంటూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం కేసీఆర్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ను ఏ మాటలు తిట్టడం అర్థం కావడం లేదు. ఈటెల రాజేందర్ ఇంకా ఆ పదవిలో వేలాడటం అవసరమా. టెస్టులు కూడా సరిగా చేయలేని సిగ్గులేని ప్రభుత్వం ఇది. మరణాల ను కూడా తక్కువ చేసి చూపుతున్నారు. ఎన్నిసార్లు తిట్టినా కేసీఆర్ కు సిగ్గోస్తలేదు.
సీఎం గా ఉండటానికి కేసీఆర్ కు అర్హత లేదు. ప్రైవేట్ హాస్పిటల్స్ తో ఎందుకు లాలూచీ పడుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ వేసే బిల్లులో మీ వాటా ఎంత…? మీరు సూటికేసులు తెచ్చుకుంటున్నారా? వారే ఇచ్చి వెళుతున్నారా…? హుజూరాబాద్ హాస్పిటల్ లో ప్రవీణ్ యాదవ్ అనే ఉద్యోగిని వేధిస్తే మరణించారు. తప్పుడు లెక్కలు చూపనందుకు ఈటెల రాజేందర్ ఆ ఉద్యోగిని చంపించాడు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.