అసలే కోతి ఆపై కల్లు తాగింది అనే నానుడి అందరికి తెలిసే ఉంటుంది.. ఆ వాక్యానికి తగ్గట్లు ఓ కోతి మద్యం బాటిల్ చూస్తే పిచ్చిది అయిపోతుంది..అవును మీరు విన్నది అక్షరాల నిజం..ఆ కోతి అసలు సంగతి ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో వైన్‌ను ఇష్టపడే కోతి బీభత్సం సృష్టిస్తోంది.మద్యం కోసం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. మద్యం కోసం ఈ కోతి ఏమైనా చేయగలదు. వైన్ షాపుకి వెళ్లి మద్యం బాటిల్ ఇచ్చే వరకు కస్టమర్ నుండి సేల్స్ మాన్ వరకు భయపెడుతుంది.ప్రతి రోజూ ఉదయం,సాయంత్రం క్రమం తప్పకుండా ఈ కోతి మందు కొడుతోంది.
మద్యం బాటిల్ దొరక్కపోతే పిగ్గీ బ్యాంకులో పెట్టిన డబ్బును చింపివేయడం వంటి పిచ్చి పనులు చేస్తోంది. షాపు యజమానికి ఈ తాగుబోతు కోతిపై ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థం కాలేదు..మరోవైపు,ఈ కోతి వీడియో వైరల్ కావడంతో, జిల్లా ఎక్సైజ్ అధికారి స్వయంగా అటవీ శాఖను సంప్రదించాలని చెప్పారు. ఎవరో కోతి ముందు బీరు డబ్బా పెట్టినట్లు సమాచారం. కోతి దానిని పానీయంగా భావించి తాగినప్పుడు, కాసేపటికి తడబడి ఒక చోట కూర్చుంది..
మళ్ళీ అదే రోజు విసుగు చెంది షాపు దగ్గరకు చేరుకొని కస్టమర్ చేతిలో నుండి మద్యాన్ని లాక్కొని తాగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు షాపు దగ్గర రచ్చ రచ్చ చేస్తూ నిత్యం మద్యం బాటిల్‌ను కోతి తీసుకెళ్తుందని, ఒక్కోసారి వినియోగదారుడి చేతిలో నుంచి లాక్కెళ్లి పారిపోతుందని చెబుతున్నారు. ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ వాళ్లు పట్టుకుని అడవిలో వదిలేశారు..అయిన ఆ వాసనకు ఎన్ని రోజులు ఆగుతుందో చూడాలి..