చైనా లో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కరోనా బారిన పడి చాలా మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, మరియు ఇతర సినీ ప్రముఖులు మృతి చెందిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే.. మన దేశంలో 18 సంవత్సరాల దాటిన వారికి కరోనా వ్యాక్సిన్లు వేస్తున్నాయి అన్ని ప్రభుత్వాలు. ఈ నేపథ్యంలో పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వడంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. మన దేశంలో 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు వచ్చే నెల అంటే ఆగస్టు మాసం నుంచి కరోనా వ్యాక్సిన్ వేసే అవకాశం ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మనసుఖ్ మాండవియా స్పష్టం చేశారు.
భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ భేటీలో కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి ఈ మేరకు ప్రకటన చేశారు. ఇక ఇప్పటికే పిల్లల వ్యాక్సిన్ సెప్టెంబర్ నెలలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా ప్రకటించిన సంగతి తెలిసిందే.