వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ రిలీజ్…!

-

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న చిత్రం వకీల్ సాబ్. బాలీవుడ్ చిత్రం పింక్ రీమేక్ గా వస్తున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్ ని కాసేపటి క్రితం పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కానుకగా విడుదల చేసారు. పవన్ కళ్యాణ్ లాయర్ లుక్ లో కనిపిస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఆకట్టుకుంది.

42 సెకన్లు ఉన్న మోషన్ పోస్టర్ లో సత్యమేవ జయతే అంటూ ప్లే అవుతుంది. చిత్ర నిర్మాత దిల్ రాజు దీనిని విడుదల చేసారు. బోనీ కపూర్ కూడా ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా కరోనా వైరస్ నేపధ్యంలో వాయిదా పడింది. త్వరలోనే సెట్స్ పై షూట్ కి వెళ్ళే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news