ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీచర్లకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. హేతుబద్ధీకరణ ద్వారా పనిచేసే స్థానాలు కోల్పోయిన టీచర్ల కు బదిలీలలో అదనంగా 5 పాయింట్లు కేటాయించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. వీరికి స్కూల్లో మ్యాపింగ్ తో సంబంధం లేకుండా ఈ అదనపు పాయింట్లు వచ్చేలా వెబ్ సైట్ లో మార్పులు చేసింది.
అలాగే గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల జిల్లా అధ్యక్ష అలాగే ప్రధాన కార్యదర్శులకు కూడా ఐదు చొప్పున కేటాయించేందుకు వీలుగా వెబ్ సైట్ లో మార్పులు చేసింది జగన్ ప్రభుత్వం. అటు టీచర్ల బదిలీల షెడ్యూల్ ను పాఠశాల విద్యాశాఖ పొడిగించింది. ఆన్లైన్ లో దరఖాస్తులు సమర్పించేందుకు ఇవాళ అవకాశం కల్పించగా దరఖాస్తుల పరిశీలనకు ఈనెల 20వ తేదీ వరకు సమయం వచ్చింది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పరిశీలన 19వ తేదీతో ముగియనుండగా దానిని 20వ తేదీకి పొడిగించింది.