అయ్యప్ప మాల వేసుకున్న వంశీ.. ఇవేం బూతులు స్వామీ..?

-

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బూతులతో హడలెత్తిస్తున్నారు. చంద్రబాబు ఇసుక దీక్ష రోజే ప్రెస్ మీట్ పెట్టిన ఆయన త్వరలోనే వైసీపీలో చేరతానని చెప్పారు. ఆ తర్వతా ఆయన ఓ ప్రముఖ టీవీ ఛానల్లో లైవ్ డిస్కషన్ కు వచ్చారు. అక్కడ టీడీపీ నేత బాబూరాజేంద్ర ప్రసాద్ తో వాగ్వాదానికి దిగారు. డిస్కషన్ లో మాటామాట పెరిగింది. అంతే వల్లభనేని వంశీ ఏకంగా బూతులు లంకించుకున్నారు. చెత్తనా.. డకా.. అంటూ రెచ్చిపోయారు.

లైవ్ డిస్కషన్ అని తెలిసి కూడా రాయలేని భాషలో బూతులు తిట్టారు. విశేషం ఏమిటంటే… వల్లభనేని వంశీ ప్రస్తుతం అయ్యప్ప దీక్షలో ఉన్నారు. ఆ దీక్షలో ఉండి కూడా ఆయన ధారాళంగా బూతులు మాట్లాడటం భక్తులకు ఇబ్బందికరంగా మారింది. ఆ తర్వాత కూడా ఆయన అదే పరిస్థితి కొనసాగిస్తున్నారు. శుక్రవారం పలు ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చిన వంశీ వాటిలోనూ పరుషమైన భాష వాడారు.

తెలుగుదేశం పార్టీలో వల్లభనేని వంశీ వెళ్లిపోవడం వల్ల ఎలాంటి నష్టం లేదని పేర్కొన్న లోకేష్ ను ఉద్దేశించి తన లాంటి వాళ్ళు వెళ్లి పోతే నష్టం లేదని, పప్పు లాంటివాళ్ళు,గుదిబండలుగా మారి పార్టీలో ఉంటే నష్టమని వల్లభనేని వంశీ పేర్కొన్నారు. పప్పు బరువు మోయలేక టిడిపి పడవ మునిగి పోతుంది అని వంశి తిట్టిపోశారు. షోకాజ్ నోటీసు ఇచ్చిన విషయం పై మాట్లాడిన వంశీ సహనం నశించి నోటికొచ్చింది తిట్టిపోశారు.

షోకాజ్ నోటీసు కాకపోతే గాడిద గుడ్డు కూడా ఇవ్వమనండి , నాకు పప్పు గాడిలా పదవుల మీద వ్యామోహం లేదు. వాళ్ళేంటి నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చేది … గాళ్లు అంటూ ఘాటుగా తిట్టారు. మొత్తానికి మొన్న రాజేంద్రప్రసాద్ ను, నిన్న చంద్రబాబును, లోకేష్ ను నోటికొచ్చినట్టు తిట్టిన వంశీ ఓ రేంజ్ లో తిట్టేశారు. కొసమెరుపు ఏంటంటే.. లైవ్‌లో రాజేంద్రప్రసాద్- వంశీ తిట్లను ప్రసారం చేసిన అదే ఛానల్.. తర్వాతలో రోజు అయ్యప్ప అపచారం అంటూ మరో డిస్కషన్ ప్రసారం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news