మహేష్ ని వదిలేసి, రామ్ చరణ్ కోసం ప్రయత్నాలు…!

-

టాలీవుడ్ లో మహేష్ బాబు తో సినిమా చేయడానికి చాలా మంది దర్శకులు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాని ఒక దర్శకుడు మాత్రం మహేష్ తో సినిమా వద్దని భావిస్తున్నాడు. మహేష్ తో సినిమా చేయడానికి ముందు నుంచి సానుకూలంగానే ఉన్న ఆ దర్శుకుడు ఇప్పుడు మాత్రం సినిమా చేయడానికి సిద్దంగా లేడు అనే ప్రచారం జరుగుతుంది. అతనే వంశీ పైడపల్లి…

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత వంశీ తో సినిమా చేసే ప్రయత్నాలు చేసారు. అయితే మహేష్ కి వంశీ రెడీ చేసిన కథ అంతగా నచ్చలేదు. దీనితో వీరి మధ్య సినిమా ఆగిపోయింది. మహేష్ బాబు కథ విషయంలో కొన్ని సూచనలు చేసినా సరే వంశీ అంతగా మహేష్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపించలేదు అని సమాచారం. మహేష్ తర్వాత ఫోన్ చేసినా అతను స్పందించలేదు.

అయితే ఇప్పుడు అతను మహేష్ ని కాదని మెగా హీరో రామ్ చరణ్ తో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ ఏ సినిమా చేస్తాడు అనేది ఎవరికి తెలియదు. కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చే సూచనలు ఉన్నాయి అనే వార్తలు వచ్చాయి. కాని అది నిజం కాదని వంశీ పైడపల్లి తో సినిమా చేసే అవకాశం ఉందని టాలీవుడ్ లో ఇప్పుడు వార్తలు షికారు చేస్తున్నాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న చెర్రీని కలిసి వంశీ కథ చెప్పినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news