ఇంట్లోనే బైక్‌ వాష్‌ చేస్తున్నారా..? ఈ జాగ్రత్తలు పాటించడం మర్చిపోకండే..!

-

ఒక ఏజ్‌ రాగానే.. అబ్బాయిలకు ఫస్ట్‌ బైక్‌ ఉండాలనిపిస్తుంది. దానికోసం ఇంట్లో చిన్నపాటి యుద్దమే చేస్తారు. కొందరు ఇంట్లో వాళ్లు ఇచ్చిన డబ్బులతో బైక్‌ తీసుకుంటే.. మరికొందరు ఫైనాన్స్‌లో కొంటుంటారు. మొత్తానికి ఎలా అయితే.. బైక్‌ వారికి నిత్యవసరం అయిపోతుంది. కొత్తమోజులో ఇక బైక్‌ను మల్లెపువ్వులా జాగ్రత్తగా చూసుకుంటారు. ఎంత జాగ్రత్తగా వాడినా.. ఒక్కసారి బైక్‌ రోడ్డెక్కింది అంటే.. ఎక్కడ లేని దుమ్ము అంతా పడుతుంది. నెలకు ఒకసారి అయినా బైక్‌ను సర్వీసింగ్‌కు ఇస్తారు. కొందరు బయట సర్వీసింగ్‌ సెంటర్లో బైక్‌ క్లీన్‌ చేయిస్తే.. మరికొందరు ఇంట్లోనే క్లీన్‌ చేస్తారు. సర్వీస్‌ సెంటర్లో వాళ్లకు అయితే అన్నీ తెలుస్తాయ్‌ కాబట్టి జాగ్రత్తగానే క్లీన్‌ చేస్తారు.. కానీ ఇంట్లో బైక్‌ వాష్‌ చేసేప్పుడు కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలి.. అవేంటో చూద్దామా..!

బైక్‌ని కడిగిన ప్రతి సారి ఎగ్జాస్ట్ పైప్‌లో ఉండే సైలెన్సర్‌లోకి నీళ్లు వెళ్లకుండా చూడాలి. నీరు లోపలకి పోతే.. బైక్‌ని స్టార్ట్ చేయడం కష్టం. ఎక్కువ సార్లు కిక్ ఇవ్వాల్సి వస్తుంది.

కీ-లాక్ లోకి కూడా వాటర్ వెళ్ళకూడదు. అక్కడకి వాటర్ పోతే.. బైక్ ని లాక్ చేయడం, అన్ లాక్ చేయడం కష్టం. కొన్ని సార్లు అది పూర్తిగా చెడిపోయే అవకాశం కూడా ఉంటుందండోయ్‌. ఒక వేళ పొరపాటున కీ-లాక్ లోకి నీరు పోతే అది ఆరిపోయే వరకు ఇబ్బంది అవుతుంది. కీ-లాక్‌లో కొంచం నూనె వేయడం ద్వారా తిరిగి లాక్ చేయడం- అన్ లాక్ చేయడం చేయవచ్చు.

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. బైక్ ను వాష్ చేసేటప్పుడు నీరు ఫ్యూయల్ ట్యాంక్‌లోకి వెళ్లకుండా చూసుకోండి. ఎందుకంటే.. ఫ్యూయల్ ట్యాంక్ లోకి వాటర్ వెళ్తే ఆ వాటర్ పెట్రోల్‌తో కలిసి పెట్రోల్ సామర్ధ్యం తగ్గుతుంది. వాటర్ కలిసిన పెట్రోల్‌ను ఇంజిన్ తీసుకోదు. దీనితో బైక్ స్టార్ట్ అవ్వడానికి ఇబ్బంది అవుతుంది. ఒకవేళ స్టార్ట్ అయినా బైక్ సరిగా నడవదు.

సో.. బైక్‌ను వాష్‌ చేసేప్పుడు ఈ చిన్నపాటి జాగ్రత్తలు తప్పక పాటించండే..!

Read more RELATED
Recommended to you

Latest news