వాస్తు: సూర్యాస్తమయం అయ్యాక ఈ తప్పులని అస్సలు చెయ్యకండి..!

-

మనం తెలియక చేసే చిన్న చిన్న తప్పులు వల్ల ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది పండితులు ఈరోజు ముఖ్యమైన వాస్తు చిట్కాలను మనతో చెప్పారు. వీటిని అనుసరిస్తే ఏ బాధ ఉండదు. సూర్యాస్తమయం అయిన తర్వాత కొన్ని తప్పులు అస్సలు చేయొద్దని పండితులు అంటున్నారు. మరి సూర్యస్తమయం అయిన తర్వాత ఎటువంటి తప్పులను చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

గోళ్ళని కత్తిరించకూడదు:

సూర్యాస్తమయం తర్వాత గోళ్ళని కత్తిరించడం మంచిది కాదు. ఇది చెడుని తీసుకొస్తుంది రాత్రిపూట లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది అటువంటి సమయంలో గోళ్ళని కత్తిరించుకుంటూ ఉంటే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది పైగా లక్ష్మీదేవి అక్కడ నిలవదు.

తల దువ్వుకోవద్దు:

రాత్రిపూట తలని దువ్వుకోవడం కూడా మంచిది కాదు ఇది కూడా నెగటివ్ ఎనర్జీ ని తీసుకువస్తుంది. జుట్టు వదులుకుని కూడా రాత్రిపూట నిద్రపోకూడదు. ఇది కూడా చెడుని కలిగిస్తుంది.

సామాన్లు కడగవద్దు:

తినేసిన వాటిని అసలు రాత్రిపూట కడగకూడదు చాలామంది ఈ తప్పును ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ తప్పును కూడా అసలు చేయొద్దు.

దానం ఇవ్వకండి:

ఎవరికి కూడా దానం ఇవ్వద్దు. ముఖ్యంగా పాలు పంచదార ఉప్పు వంటివి రాత్రిపూట దానం చేయకూడదు.

ఇంటిని శుభ్రం చేసుకోవద్దు:

రాత్రిపూట చీపురుతో తుడవడం మంచిది కాదు ఇది కూడా మీకు నెగటివ్ ఎనర్జీని కలిగిస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట ఉండదు అదృష్టం తొలగిపోతుంది సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చూశారు కదా పండితులు చెప్పిన అద్భుతమైన వాస్తు చిట్కాలని మరి వీటిని అనుసరించి ఏ బాధ లేకుండా ఉండండి.

Read more RELATED
Recommended to you

Latest news