ప్రతిపక్షాలు కలిసి రాకపోవడం బాధాకరం – వైఎస్ షర్మిల

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిపై విచారణకు డిమాండ్ చేస్తూ ఈరోజు ఢిల్లీలోని జంతర్ మంతర్ నుండి పార్టీ శ్రేణులతో కలిసి పార్లమెంట్ వరకు ర్యాలీగా బయలుదేరిన వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. పార్లమెంటు సమావేశాలు నడుస్తున్నందున ఈ ర్యాలీకి పర్మిషన్ లేదని షర్మిలను అడ్డుకున్నారు పోలీసులు.

అయినా షర్మిల ముందుకు వెళ్లే ప్రయత్నం చేయడంతో ఆమెతోపాటు, పార్టీ శ్రేణులను అరెస్టు చేసి పార్లమెంట్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ అవినీతిపై కేంద్రం విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఢిల్లీలో నిర్వహించిన ధర్నాను పోలీసులు అడ్డుకొని, నిర్బంధించడం దుర్మార్గం అన్నారు.

కాళేశ్వరానికి కేంద్ర సంస్థల నుంచే రూ.లక్ష కోట్ల రుణాలు అందాయని.. దేశ ప్రజలందరి సొమ్మును కేసీఆర్ దోచుకుతిన్నాడని ఆరోపించారు. “ఇది దేశంలోనే అతిపెద్ద స్కామ్. దీనిపై ఒక మహిళ ఒంటరిగా పోరాడుతుంటే ప్రతిపక్షాలు కలిసి రాకపోవడం బాధాకరం. బండి సంజయ్, రేవంత్ రెడ్డి మెగా కృష్ణారెడ్డికి, కేసీఆర్ కు అమ్ముడుపోయి ప్రశ్నించడం లేదు. బీజేపీ పెద్దలు అవినీతి జరిగిందని ఒప్పుకుంటున్నా విచారణ జరిపించడం లేదు” అన్నారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news