వాస్తు శాస్త్రం ప్రకారం అనుసరించడం వలన ఇబ్బందులు తొలగిపోతాయి చాలా మంది ఇబ్బందులు ఏమి కూడా వారి దరి చేరకూడదని వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం అనుసరిస్తే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అయితే చాలా మంది ఇళ్లల్లో పూజలు చేస్తూ ఉంటారు. పూజలు చేస్తున్నప్పుడు కొన్ని నియమాలను కూడా అనుసరిస్తూ ఉంటారు.
సర్వసాధారణంగా ప్రతి ఒక్క ఇంట్లో కూడా హనుమంతుడి ఫోటో లేదంటే విగ్రహం వంటివి ఉంటాయి నిజానికి హనుమంతుడు ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచడం వలన సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి దూరంగా ఉండొచ్చు కూడా.. హనుమంతుడు ఫోటోలలో చాలా రకాలు ఉంటాయి గాలిలో ఎగురుతున్నట్లుగా లేదంటే సీతా రాముడు ఫోటోని హృదయం పై కలిగి ఉన్న హనుమంతుడు విగ్రహం లేకపోతే లంకని నాశనం చేస్తున్న ఫోటో ఇలా రకరకాలు ఉంటాయి. వాస్తు శాస్త్రం ప్రకారం హనుమంతుడి ఫోటోని పెట్టేటప్పుడు దక్షిణ దిశలో పెట్టడం మంచిది.
కూర్చున్నట్టుగా హనుమంతుడు ఉండాలి. అలానే ఫోటో ఎరుపు రంగులో ఉండాలి ఇలాంటి ఫోటోని దక్షిణ దశలో పెడితే చెడు ఏమీ కూడా కలగదు. అంతా మంచే కలుగుతుంది. అలానే వాస్తు ప్రకారం హనుమంతుడి ఫోటోని బెడ్ రూమ్ లో పెట్టుకోకూడదు ఈ తప్పును అస్సలు చేయొద్దు. దీనితో నెగిటివ్ ఎనర్జీ వస్తుంది.
ఇంట్లో కనుక సమస్యలు ఎక్కువగా కలుగుతున్నట్లయితే హనుమంతుడి ఫోటో ని పెట్టండి అయితే హనుమంతుడి ఫోటోని పెట్టేటప్పుడు పంచముఖ ఆంజనేయ స్వామిని మాత్రమే ఉంచండి. అది కూడా ముఖద్వారం పైన. ఇలా చేస్తే చెడు శక్తులన్నీ కూడా దూరం అవుతాయి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు ప్రశాంతంగా కూడా ఉండొచ్చు. ఇలా ఈ విధంగా మీరు ఆచరిస్తే వాస్తు దోషాలు తొలగి ఆనందంగా జీవించొచ్చు.