హైదరాబాద్లో భారీ వడగళ్ల వాన పడనుందని ట్విట్టర్లో Telangana Rains ట్వీట్ చేసింది. 2012-2013 తర్వాత ఆ స్థాయిలో భారీ పడగళ్ల వాన మార్చి 15 తర్వాత వడనుందని ట్వీట్లో పేర్కొంది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. కాగా గత వర్షాలకు హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. వేసవి రాకముందే ఎండలు మండుతున్నాయి. వీటి ధాటికి వ్యవసాయ పనులు మందగించాయి. రెండో పంటగా వేసిన మినుము, పెసర పైర్లపై ఎండల ప్రభావం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సాధారణ ఉష్ణోగ్రతల్లో మినుము సుమారు 90 రోజులకు, పెసర 80 రోజులకు గానీ కోతలకు రావు. అటువంటిది ఎండల కారణంగా పైర్లు వాటి కాలపరిమితి కన్నా 10 రోజులు ముందుగానే కోతకు వస్తున్నాయని రైతులు అంటున్నారు. లేత పైర్లలో కూడా మొదటి రెండు పూతలు కాయదిగినా మూడో పూత ఎండల కారణంగా రాలిపోయిందని వాపోతున్నారు.