వాస్తు ప్రకారం అనుసరించడం వలన ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వాస్తు ప్రకారం అనుసరిస్తే పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. హిందువులు తులసిని పూజిస్తారు ప్రతి ఒక్క ఇంట్లో కూడా తులసి మొక్క ఉంటుంది. మీరు కూడా తులసి మొక్కని పూజిస్తారా..? మీ ఇంట్లో కూడా తులసి మొక్క ఉందా అయితే కచ్చితంగా వీటిని అనుసరించాలి వీటిని అనుసరిస్తే ఏ బాధ ఉండదు.
చాలా మంది అనేక రకాల ఇబ్బందులుని ఎదుర్కొంటూ ఉంటారు. తులసి మొక్క విషయంలో అసలు ఈ తప్పు చేయకండి. రోజూ తులసి మొక్కని పూజించడం వలన ఇంట్లో ఆనందం ధనం ఉంటాయి. తులసి మొక్కని ఇంట్లో ఉంచితే నెగటివ్ ఎనర్జీ దూరమైపోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అదృష్టం కూడా కలిసి వస్తుంది. కానీ సరైన దిశలో పెట్టకపోయినా తప్పులను చేసిన అదృష్టం ఉండదు సరి కదా దురదృష్టం కలుగుతుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కను ఎప్పుడూ తూర్పు వైపు కానీ ఆగ్నేయ పైపుని కానీ ఉంచాలి. అప్పుడే మీకు మంచి కలుగుతుంది. లేకపోతే లేనిపోని సమస్యలు వస్తాయి. మీ ఇంట్లో తులసి మొక్క ఉన్నట్లయితే మీరు దానిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఎండిపోకుండా చూసుకోవాలి. ఎండిపోతే చెడు కలుగుతుంది.
అలానే తులసి మొక్క చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉండాలి. చెప్పులు చెత్తాచెదారం చీపురు వంటివి ఉంచకూడదు అలానే తులసి దళాలని కోసినప్పుడు ఎప్పుడూ శుభ్రమైన చేతులతోనే కొయ్యాలి. తులసి మొక్కను ఎప్పుడూ నేలమీద పాతవద్దు. ఎప్పుడూ కూడా కుండీలోనే తులసి మొక్కని నాటాలి. ఇలా ఈ విధంగా మీరు జాగ్రత్తలు తీసుకుంటే సమస్యలు అన్నిటికీ దూరంగా ఉండొచ్చు.