వాస్తు: పిల్లలు బాగా చదువుకోవాలంటే… ఇలా చేయండి..!

-

వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎలాంటి సమస్యలకైనా సరే పరిష్కారం దొరుకుతుంది. వాస్తు ప్రకారం అనుసరించడం వలన పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుంది ఈమధ్య కాలంలో చాలా మంది వాస్తు ప్రకారం అనుసరిస్తున్నారు. వాస్తు ప్రకారం అనుసరిస్తే మంచే జరుగుతుందని సమస్యలన్నీ కూడా దూరం అవుతాయని భావిస్తున్నారు.

చాలా మంది పిల్లలు చదువులో రాణించలేక పోతారు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ పిల్లలకి చదువుపరంగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అలా కాకుండా మంచి జరగాలంటే ఈ వాస్తు చిట్కాలని అనుసరించడం మంచిది ఇక వాస్తు ప్రకారం పిల్లల కెరియర్ బాగుండాలంటే ఏం చేయాలనేది చూసేద్దాం.

వాస్తు ప్రకారం పిల్లలు చదువుకునేటప్పుడు వాళ్లు దక్షిణ దిశ వైపు కూర్చుని చదువుకుంటే మంచి ఫలితాలని పొందొచ్చు. ఇలా చేయడం వలన పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది చదువు మీద ధ్యాస వెళుతుంది. సరస్వతి దేవి ఫోటో హనుమంతుడి ఫోటో వినాయకుడి ఫోటో స్టడీ రూమ్ లో ఉంచుకోవడం మంచిది. హనుమాన్ చాలీసా సరస్వతి చాలీసా చదువుకోవడం వలన చక్కటి ఫలితాన్ని పిల్లలు పొందొచ్చు.

స్టడీ రూమ్ లో ఉండే అల్మారా తూర్పు వైపు లేదా ఉత్తరం వైపు ఉంటే మంచిది పిల్లల గదిలో ఎప్పుడూ కూడా లైట్ గా ఉండే రంగుల్ని ఉపయోగించడం మంచిది. కర్టెన్లని అయినా పెయింట్లు అయినా కూడా లైట్ రంగులో ఉండేటట్టు చూసుకోండి ఇలా ఈ విధంగా మీరు జాగ్రత్తలు తీసుకుంటే కచ్చితంగా చక్కటి ఫలితాలు ని పిల్లల్ని పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news