వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన చాలా రకాల సమస్యల నుండి దూరంగా ఉండొచ్చు. మన ఇంట్లో తరచూ ఏదో ఒక సమస్య కలుగుతూ ఉంటుంది. అలాంటి సమస్యలు అన్నిటికీ కూడా వాస్తు ద్వారా పరిష్కారం దొరుకుతుంది. ఈరోజు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన విషయాలని చెప్పారు వీటిని కనక మనం అనుసరిస్తే ఏ సమస్య లేకుండా ఆనందంగా ఉండొచ్చు.
గురువారం నాడు మనం ఈ విధంగా చేస్తే ఆర్థిక ఇబ్బందులు నుండి బయటపడచ్చని వాస్తు పండితులు అంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు నుండి కుటుంబ సమస్యల వరకు ప్రతి దానికి కూడా పరిష్కారం దొరుకుతుంది.
గురువారం నాడు శివాలయానికి వెళ్లి శివుడిని పూజించి కొబ్బరికాయ ని తీసుకెళ్లి శివలింగం మీద పెట్టి.. ఆ కొబ్బరికాయని బీరువాలో పెడితే చాలా మేలు కలుగుతుంది. ముఖ్యమైన రోజుల్లో ఆ కొబ్బరికాయని పూజిస్తే చాలా చక్కటి ఫలితాలను పొందవచ్చు.
విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి తులసి దళాలని గురువారం నాడు పెట్టి పూజిస్తే చక్కటి ఫలితాన్ని పొందొచ్చు. తులసి దళాలతో పాటు పూలతో కూడా మీరు పూజ చేయండి పూజ అయ్యాక తులసి దళాలని పువ్వులని తీసుకువచ్చి బీరువాలో పెట్టండి.
చైత్ర పూర్ణిమనాడు సత్యనారాయణ స్వామిని పూజిస్తే చాలా మంచి కలుగుతుంది. అలానే వాస్తు దోషాలు తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు నుండి కూడా బయటపడొచ్చు.
గురువారం నాడు విష్ణుమూర్తికి తాంబూలంలో పెట్టే చెక్క ని పెట్టి పూజించిన తర్వాత కొంచెం గంధం తిలకాన్ని పెట్టి బీరువాలో పెట్టుకుంటే సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి గురువారం నాడు ఈ విధంగా మీరు అనుసరించండి.
గురువారం నాడు ఎర్రటి క్లాత్ ని కూడా మీరు బీరువాలో పెడితే చాలా మంచిది గురువారం నాడు కలశం కింద ఎర్రటి గుడ్డను పెట్టి ఆ తర్వాత ఆ క్లాత్ ని మీరు బీరువాలో ఉంచితే చాలా చక్కటి ఫలితాన్ని పొందవచ్చు.